Ala Ninnu Cheri : హెబ్బా పటేల్ ‘అలా నిన్ను చేరి’ ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ రిలీజ్.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా..

ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ వీడియోలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్న పాయల్, హెబ్బా పటేల్, దినేష్ తేజ్ నడుమ భావోద్వేగాలను చూడొచ్చు. హీరో దినేష్ తేజ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అతనితో హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ రొమాంటిక్ రిలేషన్......................

Ala Ninnu Cheri : హెబ్బా పటేల్ ‘అలా నిన్ను చేరి’ ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ రిలీజ్.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా..

Ala Ninnu Cheri first glimps released by Raghavendrarao

Ala Ninnu Cheri :  ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు అటు యూత్ తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే బాటలో రాబోతున్న కొత్త సినిమా ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న చిత్రబృందం.. తాజాగా సంక్రాంతి కానుకగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారి చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్పారు రాఘవేంద్ర రావు.

ఫస్ట్‌లుక్‌ గ్లింప్స్ వీడియోలో లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్న పాయల్, హెబ్బా పటేల్, దినేష్ తేజ్ నడుమ భావోద్వేగాలను చూడొచ్చు. హీరో దినేష్ తేజ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. అతనితో హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ రొమాంటిక్ రిలేషన్ హైలైట్ చేస్తూ ఈ వీడియో కట్ చేశారు. సుభాష్ ఆనంద్ తన ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మెస్మరైజ్ చేశారు.

Chandrabose : ‘నాటునాటు’కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రాకతో.. గేయ రచయిత చంద్రబోస్‌ను సన్మానించిన మెగాస్టార్..

కొత్త సంవత్సరం సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ అప్ డేట్స్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చాయి. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా నేటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్, ఇతర వివరాలు అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.