అల.. వైకుంఠపురములో.. పోస్టర్ లోనే సినిమా కథ చెప్పేశారు

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 04:33 AM IST
అల.. వైకుంఠపురములో.. పోస్టర్ లోనే సినిమా కథ చెప్పేశారు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న క్రేజీ మూవీ అల.. వైకుంఠపురములో. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ లేటెస్ట్ గా విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 9.00గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైద్ది. ఖరీదైన కారు పక్కనబెట్టి, ఓ స్టూల్‌‌పై అల్లు అర్జున్ కూర్చొనడం.. ఓ సెక్యురిటీ గార్డు అగ్గిపెట్టె వెలిగిస్తుంటే.. బన్నీ బీడీ.. నోట్లో పెట్టుకుని ఉన్నట్లుగా పోస్టర్‌‌లో కనిపిస్తోంది. పోస్టర్ ను క్లియర్ గా చూస్తే.. త్రివిక్రమ్ గత సినిమాలు మాదిరిగానే ఫస్ట్ లుక్ లోనే కథ చెప్పినట్లు అర్థం అవుతుంది.

రిచ్ గా సూట్ వేసుకుని బీడీ కాలుస్తూ ఉండే తీరును బట్టి చూస్తుంటే.. చాలా ఇంట్రెస్టింగ్ కథ సినిమాలో ఉండే అవకాశం ఉంది అనిపిస్తుంది. స్టైలిష్‌గా ఉన్న బన్నీ సినిమా పోస్టర్‌ను చూసిన ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. 

ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన చిన్న వీడియో అందులోని డైలాగ్ అభిమానులను ఆనందపెట్టగా.. కొత్తగా విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. టబు కీలక పాత్ర పోషిస్తోంది. నివేదా పెతురాజ్, సుశాంత్‌లు కూడా ఇందులో నటిస్తున్నారు.

ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా.. హారికా అండ్ హసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా సినిమాని నిర్మిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇంతకుముందు బన్నీ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ సినిమా ద్వారా వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. 

నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా తర్వాత చాలి గ్యాప్ తీసుకున్న బన్నీ లేటైనా సరే మంచి కథతో ముందుకు రావాలని భావించాడు. అందులో భాగంగా త్రివిక్రమ్ కథకు ఒకే చెప్పాడు. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్‌కు అ అక్షరం సెంటిమెంట్ ఉంది.

ఈ క్రమంలోనే ఆయన అల.. వైకుంఠపురములో అని సినిమాకు పేరు పెట్టారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పేరు అలకనంద అని అందుకే ఆమె పేరులో అల.. ఆమె ఉండే ఇంటి పేరు వైకుంఠపురం అని, రెండూ కలిసి వచ్చేలా పేరు వచ్చేలా పెట్టినట్లు తెలుస్తుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

‪1st Poster of AVPL . #AlaVaikunthapuramuloPoster ‬

A post shared by Allu Arjun (@alluarjunonline) on