‘సైరా’ రికార్డును బీట్ చేసిన ‘అల వైకుంఠపురములో’..

అమెరికాలో ‘సైరా’ లైఫ్‌టైమ్‌ రికార్డును అధిగమించిన ‘అల... వైకుంఠపురములో’..

  • Published By: sekhar ,Published On : January 20, 2020 / 10:38 AM IST
‘సైరా’ రికార్డును బీట్ చేసిన ‘అల వైకుంఠపురములో’..

అమెరికాలో ‘సైరా’ లైఫ్‌టైమ్‌ రికార్డును అధిగమించిన ‘అల… వైకుంఠపురములో’..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో.. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల… వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్, హౌస్ ఫుల్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తోందీ చిత్రం..

Image

ఫస్ట్ వీక్ రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టి నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. విజయవంతంగా రెండో వారంలోకి ఎంటర్ అయిన ‘అల వైకుంఠపురములో’ యూఎస్‌లోనూ సత్తా చాటుతూ.. అక్కడ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ రికార్డును తుడిచేయడం విశేషం.. అమెరికాలో ఎనిమిది రోజుల్లోనే 2.83 మిలియన్‌ డాలర్ల వసూళ్లతో ‘సైరా’ లైఫ్‌టైమ్‌ రికార్డును అధిగమించి, అత్యధిక గ్రాస్‌ రాబట్టిన ఏడో తెలుగు సినిమాగా ‘అల వైకుంఠపురం’ నిలిచింది.

Read Also : ‘డిస్కో రాజా’ చూసి ఎంజాయ్ చేస్తారు – మాస్ మహారాజ్ రవితేజ

Image

మూడు మిలియన్‌ డాలర్ల వసూళ్లకు అత్యంత చేరువైన అల మూవీ ఓవర్సీస్‌ వసూళ్లలో తిరుగులేని రికార్డును సాధిస్తుందని ట్రేడ్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా ఓవర్సీస్‌లో ‘సరిలేరు నీకెవ్వరు’ కంటే టాప్‌లో ఉంది.