అల.. రికార్డుల వేట కొనసాగుతోందిలా..

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ వీడియో సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది..

  • Published By: sekhar ,Published On : April 4, 2020 / 11:38 AM IST
అల.. రికార్డుల వేట కొనసాగుతోందిలా..

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ వీడియో సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ ఫిల్మ్.. ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ సునామీ సృష్టించడంతో పాటు నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను క్రియేట్ చేసింది. సినిమా విడుద‌లై థియేట్రికల్ ర‌న్ ముగిసిన త‌ర్వాత కూడా..  అల.. రికార్డ్స్ మాత్రం ఆగడంలేదు..

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ రిలీజ్‌కి ముందు రిలీజ్ తర్వాత ఓ ఊపు ఊపాయి.. ఇప్పటికీ ఊపు తగ్గలేదు. తాజాగా ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

100 మిలియ‌న్ వ్యూస్‌తో పాటు.. 1 మిలియ‌న్ లైక్స్‌ను ద‌క్కించుకుందీ సాంగ్. తెలుగు పాట‌ల్లో వ‌న్ మిలియ‌న్ లైక్స్ ద‌క్కించుకున్న పాటగా ‘బుట్ట‌బొమ్మ’ సెన్సేష‌న్ క్రియేట్ చేయడం విశేషం.. రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్, ఆర్మాన్ మాలిక్ వాయిస్, జానీ మాస్టర్ స్టెప్స్ ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి.

Read Also : సోషల్ మీడియాలో చెర్రీ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా!