సోలోగా వచ్చాడు – సౌత్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేశాడు

‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో బన్నీ ఎవరూ టచ్ చెయ్యని రికార్డ్ సాధించిన ఫస్ట్ హీరోగా ట్రెండ్ క్రియేట్ చేశాడు.. 

  • Published By: sekhar ,Published On : February 12, 2020 / 01:05 PM IST
సోలోగా వచ్చాడు – సౌత్ ఇండియా రికార్డ్ క్రియేట్ చేశాడు

‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో బన్నీ ఎవరూ టచ్ చెయ్యని రికార్డ్ సాధించిన ఫస్ట్ హీరోగా ట్రెండ్ క్రియేట్ చేశాడు.. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిలిం.. ‘అల.. వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. తను కూడా ఊహించని సక్సెస్ కొట్టిన అల్లు అర్జున్.. ఈ సినిమాతో డబుల్ సెంచరీ కలెక్షన్లు కొల్లగొట్టాడు. అంతే కాదు.. ఈ కలెక్షన్లతో టాలీవుడ్‌లోనే కాదు సౌత్ ఇండియాలోనే ఇంతకుముందు ఎవరూ టచ్ చెయ్యని రికార్డ్ సాధించిన ఫస్ట్ హీరోగా ట్రెండ్ క్రియేట్ చేశాడు. 

BUNNY

సెలక్టివ్‌గా సినిమాలు చేసినా.. సక్సెస్ ఫుల్ సబ్జెక్ట్‌నే ఎంచుకున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఎప్పుడూ లేనంత యాక్టివ్‌గా ప్రమోట్ చేశాడు. రిలీజ్ డేట్ విషయంలో ఎన్ని ఇబ్బందులొచ్చినా.. అనౌన్స్ చేసిన డేట్‌లోనే సినిమాని రిలీజ్ చేశాడు. సంవత్సరంన్నర తర్వాత వచ్చిన ‘అల.. వైకుంఠపుములో’.. సినిమా బన్నీ ఫ్యాన్స్‌కే కాదు.. ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చి బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్షన్లను ఈజీగా దాటేసింది. ఇప్పుడు రూ. 200కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.  

BUNNY

రూ.200 కోట్లు ‘అల.. వైకుంఠపురములో’ సినిమా కంటే ముందు చాలా సినిమాలు కలెక్ట్ చేశాయి. అయితే మరి బన్నీ రికార్డ్ క్రియేట్ చేసినట్టు ఎలా అవుతుంది? అనేగా మీ డౌట్.. బన్నీది రికార్డే.. ఎందుకంటే.. ఈ సినిమా హిందీలో రిలీజ్ చెయ్యకుండానే రూ.200 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్‌లోనే ఈ రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ మూవీ ‘అల.. వైకుంఠపురములో’..

‘అల.. వైకుంఠపురములో’ సినిమా కంటే ముందే.. ‘బాహుబలి’, ‘రోబో’, ‘సాహో’ లాంటి సినిమాలు 200 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి. కానీ, అవన్నీ మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ అయ్యాయి. అలా అన్నీ కలిపి 200 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. కానీ బన్నీ సినిమా కేవలం తెలుగులోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసిన సోలో సినిమాగా నిలిచింది. అంతేకాదు… రూ.200 కోట్ల కలెక్షన్లు సాధించిన 6వ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 

BUNNY

సంక్రాంతికి రిలీజ్ అయిన ‘అల.. వైకుంఠపురములో’ నైజాం ,ఆంధ్రలో కలిపి రూ.173 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ సాధించిన దానికన్నా ఎక్కువే. మిగతా  రూ.27 కోట్లలో 19 కోట్లు కర్ణాటక నుంచి వచ్చినవే. నిజానికి ఆంధ్ర, నైజాంలో ‘బాహుబలి’ తర్వాత 150 కోట్లకు మించి కలెక్ట్ చేసిన సినిమాగా ‘అల.. వైకుంఠపురములో’ రికార్డ్ క్రియేట్ చేసింది. ‘సాహో’ రూ.118 కోట్లు కలెక్ట్ చేస్తే.. ‘సైరా’ రూ.147 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా మ్యాసివ్ హిట్‌తో పాటు.. బన్నీ.. టాలీవుడ్‌కి కొత్త రికార్డులు సెట్ చేస్తున్నాడు..