Ala Vaikunthapurramuloo : హిందీలో నో థియేట్రికల్ రిలీజ్.. కానీ..

అల్లు అర్జున్ ‘అల..వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ న్యూ రిలీజ్ డేట్..

Ala Vaikunthapurramuloo : హిందీలో నో థియేట్రికల్ రిలీజ్.. కానీ..

Ala Vaikunthapurramuloo Hindi

Ala Vaikunthapurramuloo: ‘పుష్ప’తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ పీక్స్‌కి చేరుకుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ‘పుష్ప’ క్రియేట్ చేసిన సెన్సేషన్ చూసి షాక్ అయ్యారంతా.. హిందీ డిస్ట్రిబ్యూటర్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్నా ఎట్టకేలకు బన్నీ రంగంలోకి దిగి.. అక్కడి బయ్యర్‌తో మాట్లాడి రిలీజ్ చేయించాడు.

Ala Vaikunthapurramuloo : హిందీలో ‘అల..వైకుంఠపురములో’..

కట్ చేస్తే, సినిమా ఎవరూ ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు సినిమా కలెక్షన్లంతా కూడా మా హిందీ సినిమాల ఓపెనింగ్స్ రావడం లేదు అని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అన్నారంటే ‘పుష్ప’ ఏ రేంజ్‌లో రచ్చ రంబోలా చేసిందో అర్థం చేసుకోవచ్చు. నార్త్‌లో బన్నీకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది ‘పుష్ప’.

Pushpa Movie : ‘పుష్ప’ ముందు హిందీ సినిమాలు తేలిపోయాయి-కరణ్ జోహర్..

హిందీ వెర్షన్ దాదాపు రూ. 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. దీంతో పార్ట్ 2కి రూ. 100 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ‘పుష్ప’ క్రేజ్‌తో ఇప్పుడు ‘అల..వైకుంఠపురములో’ హిందీలో రిలీజ్ చెయ్యబోతున్నారు. ఏఏ ఫిల్మ్స్, గోల్డ్ మైన్స్ ఫిల్మ్స్ వారు ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

Rangasthalam : బన్నీ తర్వాత హిందీలోకి రామ్ చరణ్ సినిమా..

ఇదే ఊపులో, భారీ డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో బన్నీ నటించిన బ్లాక్ బస్టర్ ‘అల..వైకుంఠపురములో’ మూవీని హిందీలో డబ్ చేసి రిలీజ్ చెయ్యాలనుకున్నారు. రిపబ్లిక్ డే స్పెషల్‌గా విడుదల చెయ్యబోతున్నట్లు జనవరి 26 తేదీతో పోస్టర్లు కూడా వదిలారు. కట్ చేస్తే.. ‘అల..వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ థియేటర్లలోకి రావడం లేదంటూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.

Allu Arjun : ‘‘సౌత్ కా సుల్తాన్’’.. ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్..

ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసాయి. మరోవైపు కేసులు పెరుగుతుండడంతో వచ్చే ఆ 50 శాతం ప్రేక్షకులు కూడా వస్తారో రారో డౌటే. దీంతో హిందీ హక్కులు తీసకున్న గోల్డ్ మైన్స్ వారు తమ ఢించాక్ టీవీ (యూట్యూబ్ ఛానెల్) లో ఫిబ్రవరి 6నుండి ‘అల..వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ ప్రీమియర్ కానుందని తెలిపారు.

Allu Arjun: నువ్వు లేక నేను లేను.. సుకుమార్‌ను తలచుకొని ఏడ్చేసిన బన్నీ!

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం ‘అల..వైకుంఠపురములో’ 2020 సంక్రాంతికి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో రికార్డ్ రేంజ్ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమాను హిందీ‌లో డబ్ చేసి, నార్త్ ప్రేక్షకులకు అందించనున్నారు. ఇప్పటికే బన్నీ నటించిన పలు సినిమాలు హిందీ డబ్బింగ్ పరంగా రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్ సాధించాయి. ఇప్పుడు ‘అల..వైకుంఠపురములో’ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి..

RGV : అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కొత్త మెగాస్టార్ అంటూ..