‘ఓ మైగాడ్ డాడీ’ – అల్లు అయాన్, అర్హల అల్లరి చూశారా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మైగాడ్ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల..

  • Edited By: sekhar , November 14, 2019 / 05:02 AM IST
‘ఓ మైగాడ్ డాడీ’ – అల్లు అయాన్, అర్హల అల్లరి చూశారా!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మైగాడ్ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. అల్లు అరవింద్, ఎస్.రాధకృష్ణ (చినబాబు) నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.. ‘అల వైకుంఠపురములో’… ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి.. చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14 ఉదయం ‘అల వైకుంఠపురములో’ మూవీలోని ‘ఓ మైగాడ్ డాడీ’ అనే సాంగ్ టీజర్ విడుదల చేసింది మూవీ టీమ్..

ముందుగా ఈ పాటను ఇద్దరు గెస్ట్‌లు రిలీజ్ చేస్తారనుకున్నారు కట్ చేస్తే టీజర్‌లో బన్నీ కుమార్తె, కుమారుడు కనిపించి సర్‌ప్రైజ్ చేశారు.. ఈ సినిమా కోసం అల్లు అయాన్, అల్లు అర్హ ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చారు. సినిమాలో వీళ్లు కనబడితే చైల్డ్ ఆర్టిస్టులుగా ఇదే డెబ్యూ మూవీ అవుతోంది. అయాన్, అర్హ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, అయాన్ వేసిన చిటుకు పుటుకు స్టెప్స్ భలే ఉన్నాయి..

Read Also : రవితేజ 66 – ‘క్రాక్’ ఫస్ట్‌లుక్

ఇద్దరూ భలే ముద్దుగా ఉన్నారు.. టీజర్‌లోనే ఇలా ఉంటే ఇక ఫుల్ సాంగ్‌లో వీళ్ల అల్లరి ఎలా ఉంటుందో చూడాలి మరి.. థమన్ ట్యూన్ కంపోజ్ చేయగా, కృష్ణ చైతన్య లిరిక్స్ రాశారు. నవంబర్ 22న పూర్తి పాటను విడుదల చేయనున్నారు. ‘అల వైకుంఠపురములో’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.