పూజా పాప ముందు ప్యారిస్ అందాలు చిన్నబోయాయే..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సామజవరగమనా’ వీడియో సాంగ్..

  • Published By: sekhar ,Published On : February 17, 2020 / 05:30 AM IST
పూజా పాప ముందు ప్యారిస్ అందాలు చిన్నబోయాయే..

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘సామజవరగమనా’ వీడియో సాంగ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘అల వైకుంఠపురములో’.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ అందించిన సాంగ్స్ ఈ సినిమాకి మెయిన్ హైలెట్.

విడుదలకు ముందే సాంగ్స్ రికార్డ్ స్థాయి వ్యూస్ తెచ్చుకున్నాయి. తాజాగా ‘సామజవరగమనా’ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. థమన్ ట్యూన్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్, సిద్ శ్రీరామ్ వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయి. పి.ఎస్. వినోద్ విజువల్స్ పాటకు మరింత వన్నె తీసుకొచ్చాయి.

 

ముఖ్యంగా పూజా అందాలతో పాటు ప్యారిస్ అందాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ‘సామజవరగమనా’ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘సాంగ్ ఆఫ్ ది ఇయర్’ గా పేరొంది ఆడియో పరంగా రికార్డ్ క్రియేట్ చేసిన ఈ పాట వీడియో రూపంలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్‌పై, అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కలిసి నిర్మించారు.