అల వైకుంఠపురములో రివ్యూ

  • Published By: madhu ,Published On : January 12, 2020 / 11:21 AM IST
అల వైకుంఠపురములో రివ్యూ

అల్లు అర్జున్‌ – తివిక్రమ్‌ కాంబినేషన్‌ అనగానే మనకు జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలే గుర్తుకొస్తాయి. ఈ రెండూ బాక్సాఫీస్‌ దగ్గర సూపర్ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు ఇద్దరు. మూడోసారి వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ అల వైకుంఠపురములో. కొంచెం గ్యాప్ ఇచ్చి మరీ చేసిన ఈ సినిమా ఎలా ఉంది. అల్లూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసిందా. బన్ని – త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌ మళ్ళీ మేజిక్‌ చేసిందా? ఈ సారి అల్లు అర్జున్ సంక్రాంతి హీరో అనిపించుకున్నాడా లేదా తెలుసుకోవాలంటే చదవండి..

సినిమా కథ : – 
ఈ సినిమా కథ విషయానకి వస్తే..రామచంద్ర ఓ బిజినెస్ మెన్ ఆయన ఆఫీస్‌లో ఎంప్లాయిగా ఉంటాడు వాల్మీకి. ఈ ఇద్దరికి ఒకేసారి ఆస్పత్రిలో పిల్లలు పుడతారు. అయితే దనవంతుడైన  రామచంద్ర బిడ్డ పురిటిలోనే చనిపోయాడని అనుకుని వాల్మీకి తనకు పుట్టిన కొడుకును తన యజమానికి ఇచ్చేస్తాడు. తన కొడుకు గొప్పగా పెరుగుతాడు అని స్వార్ధంతో ఇలా చేస్తాడు. బిడ్డలను నర్సు సహాయంతో మారుస్తారు.  కాని నిపోయాడనుకున్న బిడ్డ  తీసుకెళ్తుండగా బతుకుతాడు. 

తనలా పేదరికంలో తన కొడుకు బతకకూడదని ఆలోచించిన వాల్మీకి, అసలు నిజాన్ని చెప్పకుండా యజమాని కొడుకును తీసుకెళ్లి బంటు అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఒక మధ్యతరగతి వ్యక్తిలా అతడిని పెంచుతాడు. మరోవైపు వాల్మీకి కొడుకు రాజ్‌మనోహర్‌ శ్రీమంతుడిలా.. రామచంద్ర దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు.మరి ఈ నిజం ఎలా తెలిసింది? చివరకు అసలు తల్లిదండ్రులను హీరో కలుసుకున్నాడా? మధ్యలో అమూల్యఎలా పరిచయం అయింది? విలన్ అప్పలనాయుడు హీరో మధ్య గొడవ ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ‘అల వైకుంఠపురములో..’ చూడాల్సిందే

ఎలా నటించారంటే : –
నటీనటుల విషయానికి వస్తే..తొలిసారి అల్లు అర్జున్‌ ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేశారు. తన మార్కు స్టైల్‌తో కనిపిస్తూనే పంచ్‌లు, కామెడీ సీన్స్ తో ఇరగదీశాడు. త్రివిక్రమ్‌ మార్కు డైలాగ్‌లకు బన్నీ యాక్టింగ్ తోడవ్వడంతో సీన్లు ఓరేంజ్ లో పేలాయి. మధ్య తరగతి యువకుడిగా నటించి, అల వైకుంఠపురములోకి వెళ్లిన తర్వాత ప్రతి ఫ్రేమ్‌లోనూ అల్లు అర్జున్‌ స్టైల్‌గా కనిపించారు. ఇక బన్నీ డ్యాన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. యాక్షన్‌ సీన్స్ లో బన్నీ స్టైల్‌గా ఫైట్‌ చేయడం ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది. 
నటీ నటుల్లో అల్లు అర్జున్ తర్వాత నటించడానికి బాగా స్కోప్ ఉండి దాన్ని సద్వినియోగం చేసుకున్నది మురళిశర్మ. జయరామ్, టబు ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాజుగారి ఇంట్లో పెరిగే మంత్రి కొడుకుగా సుశాంత్ కూడా ఉన్నంతలో నటించే ప్రయత్నం చేశాడు. దాదాపు సినిమా అంతా కనిపిస్తాడుగానీ డైలాగులు చాలా తక్కువ. డైలాగ్స్ ఉన్న ఒక్క సీనూ బాగా చేశాడు. హీరోగా విరమించుకుని కమెడియన్ గా కొనసాగాలని నిర్ణయించుకున్న సునిల్ కు ఇందులోనూ పెద్దగా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే కారెక్టర్ పడలేదు. సముద్రఖని చేసిన విలన్ రోల్ బాగానే పండింది. 

సినిమా ఎలా ఉంది : – 
అల్లు అర్జున్‌ మొదటి సారి పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో అభిమానుల ముందుకు వచ్చాడు. ఈ విషయం ఆయన ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి పాత్ర ఇంతకుముందు చేయలేదు అని. అల వైకుంఠపురములో మూవీతో ఆ కోరిక నెరవేరింది. ఇద్దరు పిల్లల్లో ఒకడు ధనవంతుడి పిల్లవాడు పేదవాడి ఇంటికి, పేదవాడి పిల్లవాడు ధనవంతుడి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందన్న నేపథ్యాన్ని డైరెక్టర్ తీసుకుని అందులో సక్సెస్ అయ్యాడు. ఇలాంటి కథతో గతంలో కొన్ని చిత్రాలు వచ్చినా, త్రివిక్రమ్‌ మార్కు శైలిలో ఈ కథ సాగుతుంది. ‘స్థానం మారినా, స్థాయి మారదు’ అన్న కాన్సెప్ట్‌తో సినిమాను తీర్చిదిద్దారు  త్రివిక్రమ్‌.  ఫస్ట్ హాఫ్ అంతా మురళీశర్మ ఇంట్లో అల్లు అర్జున్‌ పెరిగి పెద్దవాడవటం.. మధ్య తరగతి కష్టాలు, బన్ని పడే ఇబ్బందులు ఇవన్నీ హాయిగా నవ్వుకునేలా తెరకెక్కించారు. పూజాహెగ్డే ఆఫీస్‌లో ఉద్యోగిగా చేరిన అల్లు అర్జున్‌ ఆమెను ప్రేమించడం, వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ను బాగా అలరిస్తాయి.

పూజా ఆఫీస్‌ సీన్స్ ఆసాంతం త్రివిక్రమ్‌ మార్కు కామెడీతో అలా సాగిపోతుంది. అదే సమయంలో పూజాహెగ్డేను చూసిన జయరాం తన కోడలిగా చేసుకోవాలని అనుకోవడం, సుశాంత్‌కు పూజాకు నిశ్చితార్థం జరగడంతో కథ మలుపు తీసుకుంటుంది. మరోవైపు జయరాం కంపెనీ వాటా కావాలంటూ అప్పలనాయుడు సీన్‌లో ఎంటర్‌ కావడంతో కథలో సీరియెస్‌నెస్‌ వచ్చింది. అల్లు అర్జున్‌కు కూడా తన తండ్రి జయరాం అని తెలియడంతో ‘అల వైకుంఠపురములో’ ప్రవేశిస్తాడు. ఆ తరువాత తన కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో సెకండ్ హాఫ్ దగ్గర కొంచెం లాగ్ చేశారు సినిమాను. 

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. త్రివిక్రమ్ రచయితగా దర్శకుడిగా ఈ సినిమాకు కంప్లీట్ గా న్యాయం చేశాడు. మంచి పాయింట్, బలమైన వైవిధ్యమైన పాత్రలతో మంచి ఎమోషన్ అండ్ ఫన్ తో సినిమాను  ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించాడు. కానీ ఆయన సెకెండ్ హాఫ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసకుని ఉంటే బాగుండేది. సినిమా ఇంకాస్త ఆసక్తికరంగా మారేది.

మ్యూజిక్, ఎడిటింగ్ : – 
ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకండా చెప్పనకర్లేదు.ఆయన ఇచ్చన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉన్నాయి. తమన్ కెరీర్ లోనే చెప్పుకోతగ్గ ఆల్బమ్ గా ఈ సినిమా ఆల్బమ్ నిలిచిపోతుంది. రాములో రాముల, సామజవరగమన పాటులు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేశాయో చూశాము. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ పనితనం కూడా బాగుంది.రామ్ లక్ష్మన్ ఫైట్స్ కిక్కునిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. 

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే సంక్రాంతి బరిలో నిల్చిన పెద్ద సినిమాల్లో ఒకటైన అల వైకుంఠపురంలో  పండక్కి సకుటుంబ సపరివార సమేతంగా సరదాగా చూసేయ దగ్గ చిత్రమే. ఆల్ రెడీ సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యి.. మంచి టాక్ తో నడుస్తోంది. ఈ సినిమా బి.సి సెంటర్స్ లో కొంచెం డల్ అయినా.. కలెక్షన్స్ విషయంలో తగ్గే అవకాశం లేదు. బాగానే రాబట్టుతుంది అని అంచనా.. 
 – ప్లస్ పాయింట్స్ : – 
అల్లు అర్జున్ నటన 
పాటలు, ఫైట్లు 
త్రివిక్రమ్ డైలాగ్స్ 
కామెడీ
 – మైనస్ పాయింట్స్ : 
పాత కథ 
ఫ్లాట్ గా నడిచిన స్క్రీన్ ప్లే 
బలమైన విలన్ లేకపోవడం 
సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ 

Read More : మీరు, నేను ఇక్కడే చావాలె..పోలీసులతో బాబు