నాశనం అవ్వాలంటే అన్నీ సహకరిస్తాయ్..

నాశనం అవ్వాలంటే అన్నీ సహకరిస్తాయ్..

Alanti Sitralu: న్యూ కంటెంట్, టాలెంట్ ఉన్న న్యూ యాక్టర్స్ చేస్తున్న చిన్న సినిమాలు పెద్ద సక్సెస్ అవుతున్నాయి. షార్ట్ ఫిలింస్ ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘పలాస 1978’ సినిమాతో ఆకట్టుకున్న ప్రవీణ్ యండమూరి, శ్వేతా పరాషర్, యష్ పూరి, తన్వీ ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘అలాంటి సిత్రాలు’..

ఐ అండ్ ఐ ఆర్ట్స్, కాస్మిక్రే ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై.. కె. రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో, సుప్రీత్ సి కృష్ణ, డి. రాహుల్ రెడ్డి, లొక్కు శ్రీ వరుణ్ కలిసి నిర్మిస్తున్నారు. సుప్రీత్ సి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. మంగళవారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘అలాంటి సిత్రాలు’ టీజర్ రిలీజ్ చేశారు.

యాక్టర్స్ పర్ఫార్మెన్స్, విజువల్స్, డైలాగ్స్, ఆర్ఆర్ బాగున్నాయి.. కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందనేది టీజర్ ద్వారా క్లుప్తంగా చూపించారు. త్వరలో ‘అలాంటి సిత్రాలు’ ప్రేక్షకుల ముందకు రానుంది. మ్యూజిక్ : సంతు ఓంకార్, సినిమాటోగ్రఫీ : కార్తీక్ సాయి కుమార్, ఎడిటింగ్, సౌండింగ్ : అశ్వథ్ శివ కుమార్.