అల.. వైకుంఠపురములో ట్విట్టర్ రివ్యూ

  • Published By: vamsi ,Published On : January 12, 2020 / 01:30 AM IST
అల.. వైకుంఠపురములో ట్విట్టర్ రివ్యూ

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సంక్రాంతి రేసులో ఉన్న భారీ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ వెండితెరను పలకరించగా.. అభిమానులు సినిమా కోసం ఎంతో ఆత్రుతగా చూశారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్‌, రాధాకృష్ణ (చినబాబు) లు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో.. కేరళలో.. ఓవర్ సీస్‌లో విడుదల అవగా.. సినిమా గురించి ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు చూసిన వాళ్లు. అభిమానులు సినిమా సూపర్ హిట్ అంటుండగా.. కామన్ ఆడియన్స్ మాత్రం కొందరు యావరేజ్ అంటున్నారు. మరికొందరు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నారు.

ఓవరాల్‌గా యునానిమస్‌గా సినిమాకు సూపర్‌ పాజిటివ్‌ టాక్‌ అయితే ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్‌ బన్నీ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్, డైలాగ్స్‌ సూపర్బ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ముఖ్యంగా బన్నీ క్యారెక్టర్‌ మాత్రం అదిరింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ బాగా వర్క్‌ అవుట్ అయ్యిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌ సూపర్బ్‌ అనిపించేలా ఉందంటున్నారు అభిమానులు.

అయితే ఫస్ట్ హాఫ్‌ను పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసిన త్రివిక్రమ్‌, సెకండ్‌ హాఫ్‌ విషయంలో మాత్రం తడబడ్డాడనే మాట కూడా వినిపిస్తుంది. ద్వితీయార్థంలో ఆకట్టుకునే సన్నివేశాలు పెద్దగా లేవని, ఒక్క హై మూమెంట్ కూడా లేకపోవటం నిరాశ కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అసలు కథను పక్కన పెట్టి త్రివిక్రమ్‌ రాసుకున్న సబ్‌ ప్లాట్‌ వర్క్‌ అవుట్ కాలేదంటున్నారు. దీంతో సెకండ్‌ హాఫ్‌ బోరింగ్‌గా తయారైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే త్రివిక్రమ్‌ మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లు, బన్నీ మేనరిజమ్స్‌ స్టైల్స్‌ బాగున్నాయట.. డాన్స్’లు ఇరగదీశాడు అనే టాక్‌ మాత్రం వినిపిస్తోంది. బన్నీ తన కామెడీ టైమింగ్‌ స్టైల్స్‌తో ఇరగదీస్తే తండ్రి పాత్రలో మురళీశర్మ మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడని అంటున్నారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌.. ఇద్దరు హీరోయిన్లు కేవలం గ్లామర్‌ షోకు పరిమితం అయ్యారని అంటున్నారు.

ఇతర పాత్రల్లో సముద్రఖని, సుశాంత్‌, వెన్నల కిశోర్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణ లాంటి నటులను తీసుకున్నా ఎవ్వరినీ సరిగ్గా వాడుకోలేదని అంటున్నారు నెటిజన్లు. అయితే వీరే సినిమాకు ప్లస్ అని కూడా కొందరు అంటున్నారు. సినిమా మొత్తం కామెడీ ఎంటర్ టైనర్ సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయని చెబుతున్నారు. ఇక తమన్ మ్యూజిక్ చాలా హైలైట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సామజ వరగమన…’ పాటతో పాటు అన్ని సాంగ్స్ బాగున్నాయని చెబుతున్నారు.

అల.. వైకుంఠపురములో రెండవసారి చూసినా బోర్ కొట్టదు.. కామెడీ, మ్యూజిక్, ఎమోషన్.. త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ హ్యూమన్ ఎమోషన్స్ బాగున్నాయి. తమన్ మ్యాజిక్ ఇరగదీశాగడు.. అందరి హీరోల డ్యాన్స్ తో మీటింగ్ సీన్ హైలెట్ అని అంటున్నారు.

అల… వైకుంఠపురములో త్రివిక్రమ్ కుమ్మేశాడు.. హీ ఈజ్ బ్యాక్ అంటూ ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు.

ఫస్ట్ హాఫ్ ఎబవ్ యావరేజ్.. సెకండ్ హాఫ్ బిలో యావరేజ్ అంటున్నారు.

స్టోరీ కొత్తది కాదు కానీ సినిమా బాగుంది అని కొందరు అంటున్నారు. ఓవరాల్‌గా సినిమాపై మిక్స్‌డ్ టాక్ వస్తుంది.