Ali : చిరంజీవికి పెళ్లి శుభలేఖ అందించిన అలీ దంపతులు..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన పెద్ద కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఇక కూతురు పెళ్లి పనులు మొదలుపెట్టిన అలీ.. శుభలేఖలు అందించే పనిలో పడ్డాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి శుభలేఖను అందించిన అలీ దంపతులు, ఈ బుధవారం తెలంగాణ గవర్నర్ 'తమిళిసై'ని కలిసి ఆహ్వానపత్రికను అందించారు. తాజాగా నేడు అలీ సతీసమేతంగా...

Ali : చిరంజీవికి పెళ్లి శుభలేఖ అందించిన అలీ దంపతులు..

Ali gave wedding invitation to Chiranjeevi

Ali : టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ.. తన పెద్ద కుమార్తెను అత్తవారింటికి పంపించబోతున్నాడు. ఇక కూతురు పెళ్లి పనులు మొదలుపెట్టిన అలీ.. శుభలేఖలు అందించే పనిలో పడ్డాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి శుభలేఖను అందించిన అలీ దంపతులు, ఈ బుధవారం తెలంగాణ గవర్నర్ ‘తమిళిసై’ని కలిసి ఆహ్వానపత్రికను అందించారు.

Ali : తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలిసిన అలీ..

తాజాగా నేడు అలీ సతీసమేతంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి శుభలేఖను చిరుకి అందించి అశీసులు అందుకున్నాడు. ఇక తన చిరకాల మిత్రుడు, ప్రస్తుత రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ ని కూడా త్వరలోనే కలిసి శుభలేఖ ఇవ్వనున్నాడట. ఇటీవలే అలీకి ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా ఆలీ కుమార్తె ‘ఫాతిమా రెమీజు’ మెడిసిన్ చదువుతుంది. ఇటీవలే హైదరాబాద్ లోని ఒక హోటల్లో కుటుంబం మరియు కొందరు సినీ ప్రముఖుల సమక్షంలో ఫాతిమా ఎంగేజ్మెంట్ ని అట్టహాసంగా జరిపించాడు ఆలీ. సినిమా పరిశ్రమకు చెందిన ఆలీ తన కూతుర్ని.. కుటుంబం మొత్తం డాక్టర్లతో నిండిన ఒక కుటుంబానికి ఇవ్వనున్నాడట. ఫాతిమా మనవాడే వరుడు కూడా డాక్టరే అని తెలుస్తుంది.