పవన్‌కు అలీ శిరస్సు వంచి నమస్కారాలు.. అయినా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..

  • Published By: sekhar ,Published On : July 15, 2020 / 01:29 PM IST
పవన్‌కు అలీ శిరస్సు వంచి నమస్కారాలు.. అయినా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్..

జూలై 13 మంగళవారం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. 50 రోజులు ముందుగా సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ #AdvanceHBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్ట‌ర్‌లో రచ్చ రంబోలా చేశారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్‌లో పాల్గొన్నారు కానీ వారందరికంటే ప్రముఖ కమెడియన్, నటుడు అలీనే ఎక్కువ హైలెట్ అయ్యాడు. వివరాళ్లోకివెళ్తే..

Ali

పవన్ బర్త్ డే ట్రెండ్‌లో పాల్గొన్న అలీ.. ఈ సందర్భంగా పవన్‌పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘‘వ్యక్తిత్వంలో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు పవన్ కల్యాణ్..’’ అంటూ నమస్కారాలు తెలుపుతూ ఓ రెడ్ హార్ట్ సిగ్నల్‌ను అలీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇంతకుముందులా అయితే ఈ ట్వీట్ చేసిన అలీని ఆయన అభిమానులు నెత్తిన పెట్టుకునేవారు. కానీ ఇటీవల పవన్, అలీల మధ్య పాలిటిక్స్ కారణంగా మనస్పర్థలు వచ్చాయి.

Ali- Pawan Kalyan

అలీపై పవన్ కల్యాణ్ ఓ బహిరంగ సభలో కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత అలీ మీడియా సమక్షంలో వాటిని ఖండిస్తూ.. పవన్‌పై కూడా సాఫ్ట్‌గా రెండు మూడు మాటలు మాట్లాడటంతో వీరిద్దరి మధ్య స్నేహం చెడింది. పాలిటిక్స్ పరంగా వీరి విధానాలు వేరు అయినా.. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరి మధ్య ప్రాణాలు ఇచ్చుకునేంత స్నేహం ఉంది. ఇక ఎన్నికల తర్వాత వీరిద్దరూ కలిసి కనబడిన దాఖలాలు ఎక్కడా లేవు. దీంతో వీరిద్దరి మధ్య ఇంకా ఆ పాలిటిక్స్ గొడవనే గుర్తు చేసుకుంటూ.. అభిమానులు అలీపై ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ‘నువ్వు చేసిన మోసం అప్పుడే ఎలా మరిచిపోతాం’.. అంటూ కాస్త గట్టిగానే అలీని వారు టార్గెట్ చేస్తున్నారు. పీకే ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై అలీ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.

Ali Tweet