Ali: పవన్‌తో మళ్లీ కనిపిస్తానంటోన్న ఆలీ!
టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అది హీరో-హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరో-కమెడియన్ కాంబినేషన్ అయినా ప్రేక్షకులను మెప్పిస్తే, వారు ఆ కాంబినేషన్‌ను....

Ali: టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అది హీరో-హీరోయిన్లు మాత్రమే కాదు.. హీరో-కమెడియన్ కాంబినేషన్ అయినా ప్రేక్షకులను మెప్పిస్తే, వారు ఆ కాంబినేషన్‌ను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటారు. అలాంటి కాంబినేషన్లలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీది కూడా ఒకటి. పవన్ నటించిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఆలీ మనకు కనిపిస్తాడు. వీరిద్దరి కోసం దర్శకులు కొన్ని స్పెషల్ సీన్స్ కూడా రాసుకున్నారంటే, వీరిద్దరి కాంబినేషన్ ఏ రేంజ్లో పండిందో మనం అర్ధం చేసుకోవచ్చు.
అయితే పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం నుండి ఆలీ పవన్ సినిమాల్లో కనిపించడం మానేశాడు. దీనికి అనేక కారణాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు జోరుగా వినిపించాయి. కానీ వాటిపై ఈ ఇరువురు కూడా నోరు విప్పలేదు. దీంతో ఇప్పుడు ఈ విషయంపై కమెడియన్ ఆలీ స్పందించాడు. ఆలీ హోస్ట్ చేస్తున్న ‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న ‘సమ్మతమే’ చిత్ర యూనిట్ సందడి చేసింది.
ఈ క్రమంలో ఆలీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదని.. మళ్లీ వారి కాంబినేషన్లో సినిమా వస్తుందా అని ఆలీని ప్రశ్న అడిగారట. దీనికి సమాధానంగా.. కారణాలు ఏవైనా, పవన్‌తో కొంతకాలంగా కలిసి యాక్ట్ చేయలేకపోయానని.. త్వరలోనే మళ్లీ మా ఇద్దరి కాంబినేషన్ ఖచ్చితంగా ఉంటుందని ఆలీ అన్నాడట. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకప్పుడు పవన్-ఆలీ కాంబినేషన్ స్క్రీన్‌పై కనిపించిందంటే, ఆ సినిమా గ్యారెంటీ హిట్ అనే ముద్ర పడింది. ఇప్పుడు మళ్లీ వీరిద్దరినీ ఒకేస్క్రీన్పై చూసేందుకు పవన్ అభిమానులతో పాటు ఆలీ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
- Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?
- Vangaveeti Radha Janasena : జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై వంగవీటి రాధ క్లారిటీ
- Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
- Harish Shankar: పవన్ నిర్ణయంతో ఆ హీరో చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్న హరీష్..?
- Tollywood stars : ఆసియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ కూతురి పెళ్ళిలో స్టార్ల సందడి
1Vice President: మాజీ సీఎంయే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి
2Kurnool : ఆస్తి కోసం పిన్నమ్మనే హత్య చేశారు
3Ritesh Rana : హ్యాపీ బర్త్‌డే.. కొత్త మల్టీవర్స్.. ఆర్టిస్టులకంటే గన్స్కే ఎక్కువ బడ్జెట్ అయింది..
4Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
5Modi Meeting: మోదీ సభకు ఐదు వేల మందితో బందోబస్తు
6CM Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. సంజయ్ వ్యాఖ్యలతో ఆశ్చర్యపోయిన యోగి
7BJP Meeting: బీజేపీ నేతలకు తెలంగాణ రుచులు.. యాదమ్మ మోనూ ఇదే
8BJP: ప్రధాని వేదికపై కూర్చునే అతిథుల పేర్లు ఖరారు
9Pakistan Protests : పాకిస్తాన్‌లోనూ ప్రవక్తపై వ్యాఖ్యల కల్లోలం
10Foreign Donations : విదేశీ విరాళాల నియంత్రణ చట్టంలో మార్పులు
-
Murmu, Yashwant Sinha : రాష్ట్రపతి ఎన్నికల బరిలో యశ్వంత్ సిన్హా, ద్రౌపదీ ముర్ము ఫైనల్
-
Bangaru Bonam : విజయవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం
-
Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్
-
Nupur Sharma : నుపుర్ శర్మపై లుక్ అవుట్ సర్క్యులర్
-
BJP Sabha : నేడు బీజేపీ విజయ సంకల్ప సభ..పరేడ్ గ్రౌండ్లో సర్వం సిద్ధం
-
Metro Trains : నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
-
UP CM Yogi : పాతబస్తీ భాగ్యలక్ష్మిఅమ్మవారిని దర్శించుకోనున్న యూపీ సీఎం యోగి..చార్మినార్ వద్ద భారీ బందోబస్తు
-
Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!