Oscar academyలో హృతిక్ రోషన్, అలియా భట్

Oscar academyలో హృతిక్ రోషన్, అలియా భట్

Oscar అకాడమీలో హృతిక్ రోషన్, అలియా భట్‌లు భాగం కానున్నారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ షిర్లే అబ్రహం, అమిత్ మధేశియాలతో పాటుగా హృతిక్, అలియాలు కూడా చేరారు. ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లలో 9వేల మందికి సభ్యుల్లో వీరు కూడా తమ ఓటుతో బెస్ట్ సినిమాను నిర్ణయిస్తారు.

డాక్యుమెంటరీ డైరక్టర్ నిషితా జైన్(గులాబీ గ్యాంగ్, లక్ష్మీ అండ్ మీ), కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా(జోధా అక్బర్, దేవదాస్), రైటర్ సబ్రినా ధావన్(కమీనే, మాన్‌సూన్ వెడ్డింగ్), క్యాస్టింగ్ డైరక్టర్స్ నందిని శ్రీకాంత్(గల్లీ భాయ్, లైఫ్ ఆఫ్ పై), టెస్ జోసఫ్(లయన్, ద నేమ్ సేక్), విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు విశాల్ ఆనంద్(వార్, భారత్), సందీప్ కమల్(పానిపట్, జల్), వీ సెంథిల్ కుమార్, డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీ క్యూబ్ సినిమా టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు 2020 ఇన్వైటీస్ జాబితాలో ఉన్నారు.

అకాడమీ అవార్డుల్లో భాగంగా సభ్యులు కేటగిరీల వారీగా ఓట్లు వేస్తారు. 2016 అకాడమీ అవార్డుల్లో వైట్ నామినీలకు ఎదురుదెబ్బ తగిలింది. బ్లాక్ ఆర్టిస్టులు స్పైక్ లీ, అవా దు వెర్నే, విల్, జడా పింకెట్ స్మిత్ లు బాయ్ కాట్ చేశారు. 2020లో ఎథినిక్, రేసియల్ కమ్యూనిటీస్ ను రిప్రజెంట్ చేసే మహిళల సంఖ్యను రెట్టింపు చేశారని అకాడమీ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది.

2016 రికార్డ్ సిట్టింగ్ గా 928 మంది వ్యక్తిగతంగా సభ్యులుగా ఆహ్వానించారు. అందులో షారూఖ్ ఖాన్, సౌమిత్ర ఛటర్జీ, మధాబీ ముఖర్జీ, ఆదిత్య చోప్రా, గునీత్ మోంగా, టబు, డాలీ అహ్లువాలియా, నసీరుద్దీన్ షా, బల్లూ సలూజా, అనిల్ మెహతాలు ఉన్నారు. ఈ సంవత్సరం మరో 819 మంది ఆర్టిస్టులు అందులో యాడ్ అయ్యారు.

అకాడమీ రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ అమెరికా బయట నాన్ ఇంగ్లీష్ సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సంవత్సరం అకాడమీ అవార్డుల్లో విదేశీ భాషా సినిమా కేటగిరీని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీగా పేరు మార్చారు. దక్షిణ కొరియాకు చెందిన పారాసైట్ ఫస్ట్ నాన్ ఇంగ్లీష్ సినిమాగా బెస్ట్ పిక్చర్ అవార్డు గెలుచుకునేంతగా ఫ్యామస్ అయింది. 2021లో జరిగే 94వ అకాడమీ అవార్డుల్లో భాగంగా బెస్ట్ పిక్చర్ ను 10వ స్థానంలో ఫిక్స్ చేస్తారు.