Alia Bhatt : వామ్మో ఏకంగా 38 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న అలియా భట్.. 7 కోట్ల ఫ్లాట్ ను అక్కకు గిఫ్ట్‌గా..

అలియా భట్ ఇటీవల తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ముంబై బాంద్రాలో ఏకంగా 38 కోట్లు ఒక పెట్టి ఫ్లాట్ ను కొనుగోలు చేసింది.

Alia Bhatt : వామ్మో ఏకంగా 38 కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న అలియా భట్.. 7 కోట్ల ఫ్లాట్ ను అక్కకు గిఫ్ట్‌గా..

Alia Bhatt buys a flat in Mumbai worth 38 crores

Alia Bhatt :  బాలీవుడ్(Bollywood) స్టార్ హీరోయిన్(Heroine) అలియా భట్(Alia Bhatt) ఇటీవల పాప పుట్టడంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. త్వరలోనే అలియా మళ్ళీ సినిమాల్లోకి రాబోతుంది. తాజాగా అలియా భట్ కు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్స్ కోట్లు పెట్టి ఇళ్ళని, అపార్ట్మెంట్స్ ని కొంటారు. ముంబైలో(Mumbai) బాలీవుడ్ స్టార్స్, ధనవంతులు ఎక్కువగా ఉండే ఏరియాలు బాంద్రా(Bandra), జుహు(Juhu) ఇక్కడ ఒక ఫ్లాట్ కొనాలన్నా కోట్లు ఉండాల్సిందే. తాజాగా అలియా భట్ బాంద్రాలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది.

అలియా భట్ ఇటీవల తన నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ముంబై బాంద్రాలో ఏకంగా 38 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వర్క్ కూడా పూర్తయింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పుడే ఈ వార్త బయటకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫ్లాట్ కి సంబంధించి ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అలియా తన భర్త రణబీర్, కూతురు రాహాతో కలిసి ఇక్కడికి షిఫ్ట్ అవ్వనుందని సమాచారం. దీంతో ఏకంగా 38 కోట్లు పెట్టి అలియా ఫ్లాట్ కొనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Jio Cinema : జియో వూట్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవేనా.. 2 రూపాయలకే సినిమాలు చూడొచ్చు..

అలాగే జుహులో మరో 7 కోట్లు పెట్టి ఓ ఫ్లాట్ కొనుగోలు చేసింది అలియా. అయితే ఈ ఫ్లాట్ ను తన అక్క షాహిన్ మహేష్ భట్ కు గిఫ్ట్ గా ఇచ్చిందట. 7 కోట్ల ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చిందని అందరూ షాక్ అవుతున్నారు.