Alia Bhatt: సినిమాలకు ఆలియా గుడ్‌బై.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..?

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని, ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసింద. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆలియా భట్, తిరిగి సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ఆలియా త్వరలోనే ఓ షాకింగ్ వార్త చెప్పనున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Alia Bhatt: సినిమాలకు ఆలియా గుడ్‌బై.. తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్..?

Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని, ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసింద. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆలియా భట్, తిరిగి సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ఆలియా త్వరలోనే ఓ షాకింగ్ వార్త చెప్పనున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Alia Bhatt : పండంటి పాపకి జన్మనిచ్చిన అలియా భట్.. అంబానీ హాస్పిటల్‌లో డెలివరీ..

ఆర్ఆర్ఆర్ సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరయిన ఆలియా, ‘బ్రహ్మాస్త’ సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం తన కూతురిని చూసుకునేందుకు సమయాన్ని ఎక్కువగా కేటాయించాలని భావిస్తుందట. అందుకే, కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని ఆలియా నిర్ణయం తీసుకుందట. దీంతో ఆమె ఇప్పటికే ఓకే చేసిన ప్రాజెక్టుల్లో వేరే హీరోయిన్లను సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా దర్శకనిర్మాతలకు తెలియజేస్తుందట ఈ బ్యూటీ.

Alia Bhatt : తన పాపని ముద్దాడుతున్న అలియా.. వైరల్ అవుతున్న వీడియో..

దీంతో తమ అభిమాన హీరోయిన్ సినిమాలకు బ్రేక్ ఇస్తుందని తెలుసుకున్న ఆలియా ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. మళ్లీ తమ అభిమాన నటి ఎప్పుడు సినిమాల్లో నటిస్తుందా అని వారు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగా ఆలియా సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటే, ఆమె అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.