Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా? Alia bhatt Hollywood entry .. Will she win there?

Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?

సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియాభట్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీ స్ చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉంది. అటు బాలీవుడ్ గంగూభాయ్, ఇటు టాలీవుడ్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ నూ తెచ్చుకుంది.

Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?

Alia Bhatt: సినిమాల విషయంలో సెలెక్టెడ్ గా ఉండే ఆలియాభట్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీ స్ చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీ గా ఉంది. అటు బాలీవుడ్ గంగూభాయ్, ఇటు టాలీవుడ్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ నూ తెచ్చుకుంది. ఇప్పుడు నార్త్, సౌతే కాకుండా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. అయితే, ఆలియా హాలీవుడ్ ఎంట్రీ పై బాగా టెన్షన్ పడుతుందట.

Alia Bhatt : నువ్వు తాగవు కానీ మమ్మల్ని తాగమని ప్రమోట్ చేస్తున్నావా.. అలియాపై ట్రోలింగ్..

ఆలియా భట్ ఎన్నో ఆశలు పెట్టుకుని, హాలీవుడ్ కి వెళ్తోంది.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా నిరూపించుకుంది. గ్లామరస్ నుంచి వుమెన్ సెంట్రిక్ మూవీస్ వరకు సింగిల్ హాండ్ తో నడిపించే స్తాయికెదిగింది. గంగూభాయ్ కతియా వాడితో తన స్టామినా సింగిల్ గానే ప్రూవ్ చేసుకుంది. ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇంట గెలిచి, రచ్చ గెలవాలన్న నానుడి ఒంటబట్టించుకున్న ఆలియా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్తాయిలో తన సత్తా చాటాలని చూస్తోంది. ఇంత ఎక్స్ పీరియన్స్ ఉన్న ఆలియా కూడా హాలీవుడ్ ఎంట్రీపై కాస్తంత ఫియర్ తోనే వెళ్తోంది.

Alia Bhatt: ఎన్టీఆర్ సినిమా నుండి అమ్మడు ఔట్..?

బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తుంది ఆలియా. బాలీవుడ్ లో సూపర్ స్టార్స్ అయినా సరే నెక్ట్స్ లెవల్ అయిన హాలీవుడ్ లో సాధించడం అంత ఈజీ కాదు. రీసెంట్ గా దీపికా పదుకోన్ వెళ్లింది. ఇలా వెళ్లి అలా వచ్చేసింది. ఫైండింగ్ ఫనీ లాంటి ఇంగ్లీష్ సినిమాతో పాటు, ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ రెండర్ కేస్ లాంటి హాలీవుడ్ మూవీ చేసింది. కాని, అక్కడ మనుగడ సాగించలేకపోయింది దీపికా.

Alia Bhatt: ఆర్ఆర్ఆర్‌పై అలియా అలక?.. అసలేం జరుగుతోంది?

గతంలో 2007లోనే దిలాస్ట్ లెజియన్ సినిమాతో ఐశ్వర్య రాయ్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా, అక్కడ ఎక్కువ కాలం ఇమడలేక పోయింది. మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, బ్రైడ్ అండ్ ప్రెజుడైజ్, ప్రోవోక్డ్, ది పింక్ పాంథర్ 2 ఈ అయిదు సినిమాలకే పరిమితమైంది. ప్రియాంకా చోప్రా కొంత వరకు హాలీవుడ్ లో నెట్టుకొస్తోందనే చెప్పాలి 2015లో క్వాంటికోతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక 2021లో వచ్చిన ది లైట్ టైగర్ వరకు అయిదు సినిమాలు చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆలియా భట్ హాలీవుడ్ లో ఏమేరకు మింగిల్ అవుతుంది?.. బాలీవుడ్ లో కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇలాంటి టైమ్ లో హాలీవుడ్ ఎంట్రీ ఇస్తే తన సక్సెస్ ఫుల్ కెరీర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఆలియాను టెన్షన్ పెడుతున్న ప్రశ్న. అందుకే ఆలియా హాలీవుడ్ ఎంట్రీకి అభిమానుల బ్లెస్సింగ్స్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. దాంతో ఆలియా ఫ్యాన్స్.. ఆలియా గ్లామర్, పెర్ఫాన్స్ తో హాలీవుడ్ లోనూ రాణించాలని బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.

×