Alia Bhatt In Oscar Race: ఇటు తారక్.. అటు ఆలియా.. ఎవరు వెళ్తారో?

బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఓ విషయంలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌తో సరిసమానంగా ఆలియా భట్ దూసుకుపోతుంది. ఇటీవల ఆస్కార్ అవార్డుల బరిలో ఎన్టీఆర్ పేరు ఉంటుందనే చర్చ తీవ్రంగా సాగుతోంది. కాగా ఇప్పుడు ఆ జాబితాలో ఆలియా కూడా చేరిపోయింది.

Alia Bhatt In Oscar Race: ఇటు తారక్.. అటు ఆలియా.. ఎవరు వెళ్తారో?

Alia Bhatt In Oscar Race For Gangubai Kathiawadi

Alia Bhatt In Oscar Race: బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన సినిమాలు, ఆమె చేసిన పాత్రలు ఆమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇక ఆమె నటించిన తాజా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ విడుదలకి రెడీగా ఉండటంతో, చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రోమోషన్స్‌లో స్పీడ్ పెంచింది. సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా, దీనికి ముఖ్య అతిధిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో బ్రహ్మాస్త్ర చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండగా.. రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.

Alia Bhatt : నేను నచ్చకపోతే నా సినిమాలు చూడకండి.. ఆలియా వ్యాఖ్యలు.. ఈ సారి బాయ్‌కాట్ అలియా..

ఇక ఆలియా భట్, ప్రస్తుతం ఓ విషయంలో జూనియర్ ఎన్టీఆర్‌తో సరిసమానంగా దూసుకుపోతుంది. ఇటీవల ఆస్కార్ అవార్డుల బరిలో ఎన్టీఆర్ పేరు ఉంటుందనే చర్చ తీవ్రంగా సాగుతోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ విషయంపై పలు డిబేట్లు కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆలియా భట్ పేరు కూడా ఆస్కార్ బరిలో వినిపిస్తోంది. ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి ఆస్కార్‌కు ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక ఆలియా ఈ సినిమాలో వేశ్య పాత్రలో నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

NTR In Oscar Race: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..? వెరైటీ మ్యాగజైన్ ప్రెడిక్షన్స్..

ఆమె ఈ సినిమాలో నటించలేదు, జీవించిందని పలువురు సినీ క్రిటిక్స్ కూడా పేర్కొన్నారు. ఆలియా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచిన గంగూబాయి కతియావాడి చిత్రంలో ఆలియా పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన అభిమానులు, ఇప్పుడు ఆమె పేరును ఆస్కార్ బరిలో చూడాలని కోరుతున్నారు. అటు ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉందనే వార్తతో ఆలియా అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఏదేమైనా గంగూబాయి కతియావాడి మూవీ గనక ఆస్కార్‌కి ఎంపికైతే ఆలియా పడిన కష్టానికి అత్యున్నతమైన ప్రతిఫలం దొరికినట్లే.