సౌత్ పై కన్నేసిన బాలీవుడ్ హీరోయిన్

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఓ స్టార్ డైరెక్టర్.. టాలివుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు.. ఇలా త్రిబుల్ స్టార్స్ తో రాబోతున్న ఓ సినిమా ఆడియన్స్ ని ఊరిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : March 29, 2019 / 11:20 AM IST
సౌత్ పై కన్నేసిన బాలీవుడ్ హీరోయిన్

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఓ స్టార్ డైరెక్టర్.. టాలివుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు.. ఇలా త్రిబుల్ స్టార్స్ తో రాబోతున్న ఓ సినిమా ఆడియన్స్ ని ఊరిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఓ స్టార్ డైరెక్టర్.. టాలివుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు.. ఇలా త్రిబుల్ స్టార్స్ తో రాబోతున్న ఓ సినిమా ఆడియన్స్ ని ఊరిస్తోంది. అయితే స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న RRR సినిమా కోసం ఒక్క తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు.. అన్ని భాషల ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : భ్రష్టు పట్టిస్తోంది : ఏంటీ ‘Bigo Live’.. మాయలో కుర్రోళ్లు

300 కోట్ల బడ్జెట్ తో రాబోతున్న RRR పై ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇక బాలివుడ్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటంతో ఆ ఎక్స్ పెక్టేషన్స్ ఇంకాస్త పెరిగిపోయాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఆలియా.. RRR టీంతో జాయిన్ కానుంది.

ప్రస్తుతం RRR షూటింగ్ రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో జరుగుతోంది. 45 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు తెరకెక్కనున్నాయి. ఈ షెడ్యూల్ లోనే ఆలియా కూడా పాల్గొనబోతుంది. అయితే RRR లో ఆలియా సీత అనే క్యారెక్టర్ లో నటిస్తోంది.

ఆలియాకి RRR తెలుగులో ఫస్ట్ సినిమా కావడం విశేషం. మొదటి సినిమాతోనే.. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించే ఛాన్స్ రావడంతో ఆలియాకి సౌత్ లో క్రేజ్ పెరగనుంది. ఫ్యూచర్లో మిగతా సౌత్ స్టార్స్ అంతా.. ఆలియాతో నటించేందుకు పోటీపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.
Read Also : ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి : జియో టాప్ 5 డేటా ప్లాన్ ఆఫర్లు ఇవే