Naatu Naatu : నాటు నాటు పాటకి అలియా, రష్మిక స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో!
నీతా అంబానీ(Nita Ambani) ప్రారంభించిన కల్చరల్ సెంటర్ సెంటర్ వేదిక పై అలియా భట్ (Alia Bhatt), రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టారు.

Alia Bhatt Rashmika Mandanna Naatu Naatu step at NMACC
Naatu Naatu : ఆస్కార్ (Oscar) అందుకున్న తరువాత కూడా నాటు నాటు (Naatu Naatu) మ్యానియా కొనసాగుతూనే ఉంది. ప్లేస్ ఏదైనా, ఈవెంట్ ఏదైనా నాటు నాటు పాట ప్లే అవ్వాల్సిందే, స్టెప్పు వెయ్యాల్సిందే అంటున్నారు. తాజాగా దేశంలో అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్ ఐపీల్ (IPL) స్టార్ట్ అవ్వగా.. ఓపెనింగ్ ఈవెంట్ లో నాటు నాటు సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఐపీల్ వేదిక పై ఈ పాటకి నేషనల్ క్రష్ రష్మిక మందన్న స్టెప్పులు వేయగా స్టేడియం మొత్తం నాటు నాటు మారు మోగిపోయింది.
Kiran Abbavaram : పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నా.. కిరణ్ అబ్బవరం!
ఇది ఇలా ఉంటే, ప్రపంచంలో అత్యున్నత సంపన్నుడైన ముకేశ్ అంబానీ(Mukesh Ambani) భార్య నీతా అంబానీ(Nita Ambani) శుక్రవారం రాత్రి (మార్చి 31) ముంబైలో కొత్త కల్చరల్ సెంటర్ స్టార్ట్ చేసింది. సౌత్, నార్త్ ఇండస్ట్రీలోని స్టార్స్ అంతా హాజరవ్వడంతో ‘నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’ (NMACC) ప్రారంభం వేడుక ఘనంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో కల్చరల్ సెంటర్ వేదిక పై అలియా భట్ (Alia Bhatt), రష్మిక మందన్న (Rashmika Mandanna) కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అదరగొట్టారు.
అలియా ఉత్సాహంతో కాళ్ళకి ఉన్న హీల్స్ తీసి మరి డాన్స్ చేయడం నెటిజెన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఈ కల్చరల్ సెంటర్ ప్రారంభించడానికి గల కారణం.. అంతరించిపోతున్న భారతీయ సంసృతి, కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నీతా అంబానీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబై జియో వరల్డ్ సెంటర్ లో ఈ కల్చరల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. నాలుగంతస్థులు దీనికోసం కేటాయించగా ఇందులో ఒక మ్యూజియం, 2000 మంది ఒకేసారి కూర్చునే థియేటర్, ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్ కు రూమ్స్, స్టూడియో.. ఇంకా అనేక విశేషాలతో కూడి ఉంది.
View this post on Instagram