Alia Bhatt : మొన్నేమో అలా.. ఇప్పుడిలా.. బాయ్‌కాట్ ట్రెండ్‌కి అలియా భట్ భయపడిందా..?

తాజాగా ఢిల్లోలో జరిగిన బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో ఓ విలేఖరి ప్రస్తుతం బాయ్‌కాట్ వాతావరణం పై మీ కామెంట్ ఏంటి, ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ చేయడం కరెక్టేనా అని అడిగారు. దీనికి అలియా భట్ సమాధానమిస్తూ..............

Alia Bhatt : మొన్నేమో అలా.. ఇప్పుడిలా.. బాయ్‌కాట్ ట్రెండ్‌కి అలియా భట్ భయపడిందా..?

Alia Bhatt recent comments on Boycott Trend

Alia Bhatt :  ఇటీవల బాలీవుడ్ అంతా బాయ్‌కాట్ ట్రెండ్ కి భయపడుతుంది. బాలీవుడ్ లో ఏ సినిమా వచ్చినా, ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా వాళ్ళు గతంలో చేసిన తప్పులని చూపిస్తూ బాయ్‌కాట్ అంటున్నారు అక్కడి ప్రేక్షకులు, నెటిజన్లు. ఓ పక్కన బాలీవుడ్ లో వరుస ఫ్లాప్స్ చాలవన్నట్టు ఈ బాయ్‌కాట్ ట్రెండ్ బాలీవుడ్ పరిశ్రమని ఆడేసుకుంటుంది. దీనివల్ల సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై సీరియస్ గా, వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా బాయ్‌కాట్ చేసేస్తున్నారు. దీంతో ఇటీవల బాలీవుడ్ స్టార్లు ఈ బాయ్‌కాట్ ట్రెండ్ పై జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.

గతంలో బాయ్‌కాట్ బాలీవుడ్ ట్రెండ్ పై అలియాభట్ మాట్లాడుతూ.. ఇష్టముంటే సినిమా చూడండి, లేకపోతే మానేయండి అని సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది. దీంతో అలియా భట్ ని, తను నటించిన బ్రహ్మాస్త్ర సినిమాని నెటిజన్లు బాయ్‌కాట్ చేశారు. ఏకంగా మూడురోజులపాటు ట్విట్టర్లో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర ట్రెండింగ్ లో ఉంది. దీంతో ఆ చిత్ర యూనిట్ జాగ్రత్తగా మాట్లాడుతున్నారు.

Anasuya : మీలా పనీపాట లేని వాళ్లకి బుద్ధి చెప్పే టైమ్ వచ్చింది.. మళ్ళీ ట్విట్టర్లో అనసూయ రచ్చ..

రణబీర్ కూడా బాయ్‌కాట్ గురించి నెగిటివ్ గా మాట్లాడకుండా తప్పించుకున్నాడు. ఇక తాజాగా ఢిల్లోలో జరిగిన బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో ఓ విలేఖరి ప్రస్తుతం బాయ్‌కాట్ వాతావరణం పై మీ కామెంట్ ఏంటి, ఇలాంటి టైంలో సినిమా రిలీజ్ చేయడం కరెక్టేనా అని అడిగారు. దీనికి అలియా భట్ సమాధానమిస్తూ.. ‘‘ఏ వాతావరణం లేదు. సినిమా రిలీజ్ చేయడానికి ఇది మంచి వాతావరణమే. ప్రస్తుతం మనందరం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలి. జీవితంపట్ల ప్రతిఒక్కరూ కృతజ్ఞత భావంతో ఉండాలి. ఈ పర్యావరణంలో నెగెటివిటీ అనేది లేదు. అంతా పాజిటివిటీనే ఉంది’’ అని బాయ్‌కాట్ పేరు ఎత్తకుండా బదులిచ్చింది.

దీంతో అలియా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడేమో సినిమా చూస్తే చూడండి అని పొగరుగా మాట్లాడి, ఇప్పుడేమో బాయ్‌కాట్ బ్రహ్మాస్త్ర ట్రెండ్ అవ్వడంతో ఇలా జాగ్రత్తగా మాట్లాడుతుంది, ఇదేదో ముందు నుంచి ఉండొచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు.