Alia Bhatt : 15 నిమిషాల పాత్రకి భారీ రెమ్యునరేషన్ తీసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

ఇందులో చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ నటించింది. అయితే ఈ పాత్ర సినిమాలో కేవలం 15 నిముషాలు మాత్రమే కనిపిస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ 15 నిమిషాల పాత్రకు ఏకంగా.....

Alia Bhatt : 15 నిమిషాల పాత్రకి భారీ రెమ్యునరేషన్ తీసుకున్న ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్

Aliya

Alia Bhatt :  ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఈ భారీ మల్టీస్టారర్ ని తీశారు. జన‌వ‌రి 7న ఈ సినిమా విడుదల కాబోతుంది. పాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు ప్రేక్షకులే కాక దేశం మొత్తం ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ప్రమోట్ చేయడం మొదలు పెట్టారు. జక్కన్న దగ్గరుండి మరీ ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

Tollywood Hero’s : టాలీవుడ్ హీరోల ఇళ్ల ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో చరణ్ కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభట్ నటించింది. అయితే ఈ పాత్ర సినిమాలో కేవలం 15 నిముషాలు మాత్రమే కనిపిస్తుంది అని సమాచారం. ఇదే విషయం రాజమౌళి తండ్రి ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. అయితే ఈ పాత్ర కోసం అలియా భారీగానే డిమాండ్ చేసిందట.

Pushpa : ‘పుష్ప’ ట్రైలర్ వచ్చేది అప్పుడే.. దుబాయ్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్?

మొదట ఈమె పాత్ర షూటింగ్ ని కేవలం 10 రోజులు అనుకున్నారు. అయితే కరోనా వల్ల సినిమా వాయిదా పడుతూ షూటింగ్ జరగడం వల్ల అలియా 10 రోజుల కంటే ఎక్కువ రోజులే షూటింగ్ లో పాల్గొంది. ఈ బాలీవుడ్ బ్యూటీ 15 నిమిషాల పాత్రకు ఏకంగా 5 కోట్లు తీసుకున్నట్టు సమాచారం. 15 నిమిషాల పాత్రకి, 10 రోజుల షూటింగ్ కి 5 కోట్లు అంటే చాలా ఎక్కువ అంటున్నారు తెలుగు ప్రేక్షకులు.

Salman Khan – Katrina Kaif: వైరల్‌గా మారిన సల్మాన్ – కత్రినాల పెళ్లి వీడియో

అయితే ఆ పాత్రకు కేవలం అలియా మాత్రమే కావాలని రాజమౌళి పట్టుడట్టడంతో పాటు ఆలియాకు పాన్ ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉందని, బాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ అవుతుందని రాజమౌళి నిర్మాతలకి చెప్పడంతో నిర్మాత దానయ్య అలియాకి 5 కోట్లు ఓకే చేసారని సమాచారం. మరి చూడాలి ఆలియా తాను తీసుకున్న 5 కోట్లకు ఎంత వరకు న్యాయం చేస్తుందో.