Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం.. | Alia Bhatt Turned as Producer

Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం..

ఇటీవల ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది అలియాభట్. తన తొలి చిత్రం డార్లింగ్స్ అనే టైటిల్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో తల్లీకూతుళ్ల అనుబంధాన్ని...............

Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం..

Alia Bhatt :  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ ఇటీవల వరుస సినిమాలతో హిట్స్ కొట్టి మంచి ఫామ్ లో ఉంది. అలియాభట్ నటించిన RRR , గంగూభాయ్ కతీయవాడి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టి అలరించాయి. తాజాగా అలియాభట్ నిర్మాతగా మారింది.

ఇటీవల ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది అలియాభట్. తన తొలి చిత్రం డార్లింగ్స్ అనే టైటిల్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో తల్లీకూతుళ్ల అనుబంధాన్ని వినోదంతో మేళవించి చూపించనున్నట్టు సమాచారం. ఇందులో అలియాభట్ నటిస్తూ నిర్మించడం మరో విశేషం. ఈ సినిమాకి జష్మీత్‌ కీ రీన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణంలో షారుఖ్ ఖాన్ కూడా భాగమయ్యాడు. తన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా నిర్మాణంలో భాగమైంది.

Kalyani Priyadarshan : అవార్డు వేడుకల్లో అదరహో అనిపించిన కళ్యాణి ప్రియదర్శన్

త్వరలోనే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా గురించి అలియాభట్ మాట్లాడుతూ.. నిర్మాతగా ఇది నా తొలి సినిమా కాబట్టి నా కెరీర్‌లో ప్రత్యేకమని భావిస్తున్నాను. ఒక పక్కన వినోదం పండిస్తూనే ఎమోషన్స్, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి అని తెలిపింది.

×