ఇద్దరి మధ్య ఇరుక్కుందా? శుభాకాంక్షలు కూడా చెప్పారే.. అయినా ఎందుకు తప్పుకుందబ్బా?

RRR - చిత్రం నుంచి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తప్పుకుందా?..

  • Published By: sekhar ,Published On : March 19, 2020 / 09:37 AM IST
ఇద్దరి మధ్య ఇరుక్కుందా? శుభాకాంక్షలు కూడా చెప్పారే.. అయినా ఎందుకు తప్పుకుందబ్బా?

RRR – చిత్రం నుంచి బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తప్పుకుందా?..

దర్శకధీరుడు రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘#RRR’ చిత్రం నుంచి తాజా అప్‌డేట్ వచ్చింది. కాకపోతే అది షాకింగ్ అప్ డేట్ కావడంతో సినీ అభిమానులు నిరాశకు గురవుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తప్పుకుందనే వార్త ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాకు గానూ అలియా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది, ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ విషెస్ కూడా తెలిపింది కదా.. ఇంతలోనే ఎందుకు తప్పుకుంది? అంటూ సినీ ప్రముఖులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

జక్కన్న సినిమా నుంచి అలియా తప్పుకోవడానికి కారణం ఏంటి అంటే.. ఇప్పటికే అలియా.. హిందీలో ‘బ్రహ్మాస్త్ర’, ‘సడక్ 2’, సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూభాయ్ కతియావాడి’ సినిమాలతో బిజీగా ఉంది. దీంతో డేట్లు సర్దుబాటు చేయలేక ‘ఆర్ఆర్ఆర్’ నుంచి అలియా తప్పుకుందని సమాచారం. సంజయ్ లీలా భన్సాలీ కూడా జక్కన్నలా ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెక్కుతాడు. ఆయన సినిమాలూ త్వరగా పూర్తి కావు అనే సంగతి తెలిసిందే. అలాగే రాజమౌళితో సినిమా అంటే తొందరగా తేలే విషయం కాదు.

ప్రభాస్ ‘బాహుబలి’ కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించాడు. చరణ్, తారక్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ కమిట్ అయ్యాక మరే సినిమాలోనూ కనిపించలేదు. డేట్లు అడ్జెస్ట్ అయితే మే లో జరిపే షెడ్యూల్‌లో అలియా జాయిన్ అవనుందనే మాట కూడా వినిపిస్తోంది. స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘RRR’లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరంభీమ్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న సంగతి తెలిసిందే.