Alia-Ranbir: అలియా కల నిజమయ్యే క్షణం.. కపూర్-భట్ వారి పెళ్లిసందడి!

గట్టిగా అనుకో.. కోరుకున్నది అయితదిలే.. ఈ సినిమా డైలాగ్ ఆలియా లైఫ్ కు బాగా సింక్ అవుతుంది. అవును ఈ హీరోయిన్ అనుకున్నట్టే తన విష్ నెరవేరుతోంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే..

Alia-Ranbir: అలియా కల నిజమయ్యే క్షణం.. కపూర్-భట్ వారి పెళ్లిసందడి!

Alia Bhatt Ranbir Kapoor Marriage

Alia-Ranbir: గట్టిగా అనుకో.. కోరుకున్నది అయితదిలే.. ఈ సినిమా డైలాగ్ ఆలియా లైఫ్ కు బాగా సింక్ అవుతుంది. అవును ఈ హీరోయిన్ అనుకున్నట్టే తన విష్ నెరవేరుతోంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే రణ్ బీర్ పై క్రష్ చూపించిన ఆలియా.. ఇప్పుడా స్టార్ ను తన భర్తగా మార్చుకునేందుకు ఇంకా కొన్ని గంటలే మిగిలాయి. హల్దీ, మెహందీ హడావిడీ అయిపోయి అసలైన క్షణం కోసం ఎదురుచూస్తోన్న ఈ జంట రియల్ లవ్ స్టోరీపై ఓ లుక్..

Alia-Ranbir Wedding: రణబీర్‌తో అలియా పెళ్లి ఎక్కడ.. అతిధులు ఎంత మందంటే?

పెళ్లి సందడి షురూ అయింది.. వెడ్డింగ్ డెస్టినేషన్ ఎదురుచూస్తోంది.. డిజైనర్ నగలు, బట్టలు సిద్ధంగా ఉన్నాయి.. రిసెప్షన్ హడావిడీ, హనీమున్ పనులు.. అన్నీ చక చకా జరిగిపోతున్నాయి. అయితే ఇవన్నీ కాదు.. రణ్ బీర్-ఆలియా వెయిట్ చేస్తున్నది మాత్రం భార్యభర్తలుగా మారే క్షణం కోసమే. ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంకోసం ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా ఎదురుచూస్తోంది.

Ranbir-Alia: మిస్టరీలా అలియా పెళ్లి.. ఫ్యాన్స్‌కు పెద్ద పజిల్ ఇస్తున్న లవ్ బర్డ్స్!

రణ్ బీర్ కి ఐదేళ్లే కావొచ్చు.. కానీ రణ్ బీర్ పై ఆలియా మాత్రం మొదటి నుంచి ప్రేమను చూపిస్తోంది. బాలీవుడ్ ఎంట్రీ ఫిల్మ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ప్రమోషన్స్ లోనే రణ్ బీర్ ని తను ఎంతలా ప్రేమిస్తుందో.. ఆ క్రష్ ఎలాంటిదో ఆమె రివీల్ చేసింది. చిన్నప్పటి నుంచి కపూర్ కుర్రాడిని ఆరాధిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలనుందని కూడా కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో చెప్పింది. కానీ రణ్ బీర్ స్టోరీ వేరు. ఆలియా కంటే 10 సంవత్సరాలు పెద్దైన రణ్ బీర్.. దీపికా, కత్రినా వంటి హీరోయిన్స్ తో డేటింగ్ చేసి విడిపోయి విఫల ప్రేమికుడిగా మిగిలాడు. అయితే చివరకి వీళ్లిద్దరిని కలిపింది బ్రహ్మాస్త్ర.

Ranbir-Alia: తీరనున్న రణబీర్ తల్లి కోరిక.. కోడలి కోసం పదేళ్లుగా ఎదురు చూపులు!

2018 నుంచి బ్రహ్మాస్త్ర షూటింగ్ టైమ్ లో ఒక్కొక్కటిగా రణ్ బీర్-ఆలియా కలిసున్న ఫోటోలు బయటికొచ్చాయి. నీతూ కపూర్, ఆలియా పోస్ట్ చేసిన ఫోటోలతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత సోనమ్ కపూర్ వెడ్డింగ్ లో జంటగా పబ్లిక్ ముందుకొచ్చేసారు. ఆపై సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూల్లో అఫీషియల్ గా రిలేషన్ షిప్ పై పాజిటివ్ గానే స్పందించారు. ఇంకేముంది న్యూ ఇయర్ పార్టీలు, బర్త్ డే ట్రీట్స్, అవార్డ్స్ ఫంక్షన్స్ లో ఎక్కడైనా ఒక్కటిగానే కనిపించారు వీళ్లు.

Alia Bhatt Ranbir Kapoor Marriage: వెడ్డింగ్ డేట్ లాక్.. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి వేదిక ఫిక్స్?

కోవిడ్ పాండెమిక్ కారణంగా బ్రహ్మాస్త షూట్ డిలే అయినా.. వీళ్ల బాండింగ్ మాత్రం బలపడింది. రిషి కపూర్ మరణించినప్పుడు.. కపూర్ ఫ్యామిలీ ముందుండి కొన్ని పనులను ఆలియా మ్యానేజ్ చేసింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ రణ్ బీర్ బర్త్ డే స్పెషల్ గా రాజస్థాన్ లో ఈ జంట విహరించింది. ఇలా ఇలా.. ఫ్యాన్స్ కు కావాల్సినన్ని హింట్ ఇచ్చుకుంటూ.. పెళ్లి అప్పుడు ఇప్పుడూ అని ఊరిస్తూ.. చివరికి ఐదురోజులకు మించిన పెళ్లి వేడుకలతో రణ్ బీర్- ఆలియా ఒక్కటవుతున్నారు.