గంగూబాయిగా అలియా లుక్ అదిరిందిగా!

ఆలియా భట్‌ నటిస్తున్న ‘గంగూబాయి ఖథియావాడి’.. (మాఫియా క్వీన్) ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు విడుదల..

  • Published By: sekhar ,Published On : January 15, 2020 / 06:15 AM IST
గంగూబాయిగా అలియా లుక్ అదిరిందిగా!

ఆలియా భట్‌ నటిస్తున్న ‘గంగూబాయి ఖథియావాడి’.. (మాఫియా క్వీన్) ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు విడుదల..

ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భనాల్సీ దర్శకత్వంలో ఆలియా భట్‌ తొలిసారి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గంగూబాయి ఖథియావాడి’.. (మాఫియా క్వీన్). 
 బుధవారం ఈ సినిమాలోని ఆలియా ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను మూవీ యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్లలో పవర్‌ఫుల్‌ స్టన్నింగ్‌ లుక్‌తో ఆలియా అదరగొట్టేసింది.

యంగర్‌లుక్‌తో పాటు.. నుదుటను పెద్ద తిలకం ధరించి.. ముక్కుపుడకతో గంభీరంగా చూస్తున్న లుక్‌ కూడా ఆకట్టుకుంటోంది. మాఫియా క్వీన్ గంగూబాయి ఖథియావాడి జీవిత కథలోని కీలక అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారని బాలీవుడ్ టాక్. హుస్సైన్‌ జెదీ రచించిన మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై పుస్తకం ఆధారంగా సినిమా రూపొందుతోంది. 

గంగూబాయి ఖథియావాడిగా అలియా నటన ఓ రేంజ్‌లో ఉంటుందని చిత్ర బృందం చెప్తోంది. ఈ సినిమాను 2020 సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. నిర్మాతలు : సంజయ్‌ లీలా భనాల్సీ, జయంతిలాల్ గడా.