‘ఉప్‌చిక్.. ఉప్‌చిక్.. ఉప్పా ఉప్పా’.. అందుకే ఆ టాటూ వేసుకున్నా..

యాంకర్, యాక్టర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా ప్రమోషన్లో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు..

  • Published By: sekhar ,Published On : March 18, 2020 / 11:47 AM IST
‘ఉప్‌చిక్.. ఉప్‌చిక్.. ఉప్పా ఉప్పా’.. అందుకే ఆ టాటూ వేసుకున్నా..

యాంకర్, యాక్టర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమా ప్రమోషన్లో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు..

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకుని, పూర్తిస్థాయి హీరోగా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాతో ప్రేక్షముల ముందుకు రాబోతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వూలిస్తున్న ప్రదీప్ తాజాగా కామెడీ కింగ్ ఆలీ హోస్ట్ చేస్తున్న ‘ఆలీతో సరాదాగా’ కార్యక్రమాని వచ్చేసి.. తన ప్రొఫెషన్ అండ్ పర్సనల్ లైఫ్ గురించిన పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు ప్రదీప్..

Alitho Saradaga Chat Show with Anchor and Actor Pradeep Machiraju

‘టీవీలో నేను చేస్తున్న ఓ ప్రోగ్రామ్ చూసి డైరెక్టర్ మున్నా గారి అమ్మ గారు, వైఫ్ నవ్వుతుండగా.. ఆయన చూసి ఇంట్లో ఆడవాళ్లు కూడా నవ్వుతున్నారంటే ఇతను నా సినిమాకు హీరోగా కరెక్ట్ ఆప్షన్ అని ఫిక్స్ అయ్యారట.. ‘నీలి నీలి ఆకాశం’, ‘మీకో దణ్ణం’ పాటలకు ఊహించని స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. 

http://www.10tv.in/ride-sushanth-ichata-vaahanamulu-nilupa-raadhu-28510
Read Also : తియ్ బండి.. సుశాంత్ ట్రాక్‌లోకి వచ్చేలా ఉన్నాడే..

మా నలుగురిదీ ఒక గ్రూప్..
రష్మి, సుధీర్, ప్రియమణి, నేను కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. దాని పేరు ‘ఉప్‌చిక్.. ఉప్‌చిక్.. ఉప్పా ఉప్పా’.. వెరైటీగా ఉంటుందని ఈ పేరు పెట్టాం.. యానీ, శేఖర్ మాస్టర్ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. 

Alitho Saradaga Chat Show with Anchor and Actor Pradeep Machiraju

నా చేతిమీదున్న టాటూకి అర్థం అదే..
నా చేతిపై ఉన్న టాటూ ఏంటంటే.. గద్ద, దాని వెనుక సూర్యుడు.. నాకు పక్షులంటే చాలా ఇష్టం.. అవి ఎంత ఎత్తులో ఎగిరినా కింద ఉన్న ఎలుకలు కూడా కనిపిస్తాయట.. ‘నువ్వు ఎంత ఎత్తైనా ఎగురు.. నీ తిండి మాత్రం భూమి మీదే ఉంది’ అని దాని అర్థం.. సూర్యుడి అంత ఎత్తుకి ఎదగాలని ఈ టాటూ వేసుకున్నా.. అని చెప్పాడు ప్రదీప్..