Virupaksha Teaser: అందరి కళ్లు ‘విరూపాక్ష’ టీజర్ పైనే..!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా, సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.

Virupaksha Teaser: అందరి కళ్లు ‘విరూపాక్ష’ టీజర్ పైనే..!

All Eyes On Sai Dharam Tej Virupaksha Teaser

Virupaksha Teaser: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా, సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టైటిల్ గ్లింప్స్ ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి.

Virupaksha : విరూపాక్ష టీజర్ చూసిన పవన్ కళ్యాణ్.. టీంకి అభినందనలు!

కాగా, నేడు ఈ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరొక గంటలో ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. వాస్తవానికి ఈ చిత్ర టీజర్ నిన్నే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, ఓ మెగా అభిమాని మృతి కారణంగా ఈ చిత్ర టీజర్ రిలీజ్‌ను ఒక రోజు వాయిదా వేశారు. ఇక నేడు రిలీజ్ కానున్న ఈ టీజర్‌ను పవన్ కల్యాణ్ ఇటీవల లాంచ్ చేశారు. ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా ఈ టీజర్ ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Virupaksha: విరూపాక్ష కోసం వస్తున్న వీరమల్లు.. ఫ్యాన్స్‌కు పండగే!

దీంతో ఈ టీజర్ ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. యాక్సిడెంట్ తరువాత తేజు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలో ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, సక్సెస్‌ఫుల్ బ్యూటీ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.