Tamil Star Heroes: తమిళ టాప్ స్టార్స్ అంతా హైదరాబాద్‌లోనే బస!

అన్నపూర్ణ సెవన్ ఎకరాస్ లో విజయ్, అల్యూమినియం ఫాక్టరీలో అజిత్, ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో ధనుష్, నానక్ రామ్ గూడలో శివకార్తికేయన్ ఇలా తమిళనాడు టాప్ స్టార్స్ అంతా హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు.

Tamil Star Heroes: తమిళ టాప్ స్టార్స్ అంతా హైదరాబాద్‌లోనే బస!

Tamil Star Heroes

Tamil Star Heroes: అన్నపూర్ణ సెవన్ ఎకరాస్ లో విజయ్, అల్యూమినియం ఫాక్టరీలో అజిత్, ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో ధనుష్, నానక్ రామ్ గూడలో శివకార్తికేయన్ ఇలా తమిళనాడు టాప్ స్టార్స్ అంతా హైదరాబాద్ లో సందడి చేస్తున్నారు. ఎందుకు, ఏఏ సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చారు.. ఫుల్ డిటైల్స్ పై హావే లుక్.

South Star Heroes: యష్ నుండి మహేష్ వరకు.. రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తమిళ స్టార్ తళపతి విజయ్ 66 మూవీని వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది. దాదాపు ఫైవ్ క్రోర్స్ తో వేసిన భారీ సెట్ లో మూడు వారాల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంకా నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే జరగనుంది. విజయ్ మూవీలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. తమిళ్ సీనియర్ యాక్టర్స్ శరత్ కుమార్, ప్రభులతో పాటూ ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ లాంటి సీనియర్ యాక్టర్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. వీరితో పాటు కిక్ శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త వంటి వారు విజయ్ 66లో కీ క్యారెక్టర్స్ చేస్తున్నారు.

Tamil Heroes: తమిళ తంబీలు మారాలి.. మన హీరోలను చూసి నేర్చుకోవాలి

అజిత్ హీరోగా వినోద్ హెచ్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మిస్తున్న ఏకె 61 సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. వలిమై తర్వాత అజిత్ తో మరోసారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు బోనీ కపూర్. ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మించారు. జూన్ నెల ఆఖరు వరకు ఇక్కడే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో అజిత్ సరసన మంజు వారియర్ నటిస్తోంది. ధనుష్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగవంశీ నిర్మిస్తున్న సినిమా సార్. ఈ సినిమా షూటింగ్ అర్ టి సి క్రాస్ రోడ్స్ ఉష మయూరి థియేటర్ లో జరుగుతుంది. ధనుష్ సరసన సంయుక్త మీనన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ వారం రోజులు పాటు ఇక్కడే జరగనుంది. ఇంకా వరస సక్సెస్ లతో దూసుకెళ్తోన్న మరో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటున్నాడు. రాజ్ కుమార్ డైరెక్షన్ లో ఈ సినిమా షూటింగ్ నానక్ రామ్ గుడ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది.ఈ నెలాఖరు వరకు ఈ షెడ్యుల్ జరుగనుంది.