‘అల.. రికార్డుల వేట కొనసాగుతోంది ఇలా’..

యూట్యూబ్‌లో మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘అల వైకుంఠపురములో’..

  • Published By: sekhar ,Published On : March 7, 2020 / 07:16 AM IST
‘అల.. రికార్డుల వేట కొనసాగుతోంది ఇలా’..

యూట్యూబ్‌లో మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ‘అల వైకుంఠపురములో’..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్..‘అల వైకుంఠపురములో’.. విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ‘అల’ రికార్డుల వేట ఇంకా పూర్తవలేదు.

విడుదలకు ముందే సూపర్‌హిట్ అయిన ‘అల వైకుంఠపురములో’.. ఆల్బమ్ తాజాగా ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలై సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది సేపట్లోనే ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛాన‌ల్‌లో మిలియ‌న్స్ కొద్దీ వ్యూస్ దక్కించుకుంది.(జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్)

అంతేకాకుండా ఈ సినిమా పాట‌లు పాన్ ఇండియా వైడ్ ఉన్న అన్ని ప్ర‌ఖ్యాత మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌పై టాప్‌ప్లేస్‌లో ట్రెండ్ అవుతుండ‌టం విశేషం. బాలీవుడ్ పాట‌ల‌ను వెన‌క్కి నెట్టి మరీ జియోసావ‌న్, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ వంటి ఆల్బ‌మ్స్‌లో టాప్ 1, 2 , 6 స్థానాల్లో ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటు వింక్, గానా వంటి మ్యూజిక్ ఆప్స్‌లో సైతం హ‌వా కొన‌సాగిస్తున్నాయి. సన్ నెక్స్ట్‌లో ‘అల వైకుంఠపురములో’.. స్ట్రీమింగ్ అవుతోంది..