Pushpa 2: ఆడియో రైట్స్‌తో ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేస్తున్న పుష్ప-2..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప-2’ మూవీకి సంబంధించిన ఆడియో రైట్స్ ఏకంగా రూ.65 కోట్ల భారీ రేటుకు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది.

Pushpa 2: ఆడియో రైట్స్‌తో ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేస్తున్న పుష్ప-2..?

All Time Record Price For Pushpa 2 Audio Rights

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన పుష్ప-2 వీడియో గ్లింప్స్ ఈ సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.

Pushpa 2 : 100 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్..

పాన్ ఇండియా స్థాయయిలో ఈ సినిమాపై అంచనాలు నెలకొనడంతో, ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ అయినట్లుగా తెలుస్తోంది. పుష్ప-2 చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ ను ప్రముఖ సంస్థ టీ-సిరీస్ ఏకంగా రూ.65 కోట్ల భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక సినిమా ఆడియో రైట్స్‌కే ఇంత మొత్తంలో భారీ రేటు రావడంతో ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది హయ్యెస్ట్‌గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

Pushpa 2 : 100 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న పుష్ప రాజ్..

ఇక పుష్ప-2 మూవీలో అల్లు అర్జున్ మరోసారి తనదైన విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా, ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ మూవీలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.