నటుడిగా మళ్ళీ జన్మించాను : అల్లరి నరేష్ ఎమోషనల్ ట్వీట్

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అల్లరి నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

  • Published By: sekhar ,Published On : May 10, 2019 / 07:30 AM IST
నటుడిగా మళ్ళీ జన్మించాను : అల్లరి నరేష్ ఎమోషనల్ ట్వీట్

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అల్లరి నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు యాక్టింగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్‌తో పాటు అల్లరి నరేష్ నటన ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. చాలాకాలం తర్వాత నరేష్‌ని ఇలాంటి క్యారెక్టర్‌‌లో చూడడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి నిచ్చింది.

మహర్షిలో రిషితో పాటు రవి కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్.. ట్రైలర్ చూసి ఈ సినిమాలో నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు అనుకుంటే, సినిమా చూసాక అతని క్యారెక్టర్ కూడా సినిమాలో వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని అర్థమయింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

’17 సంవత్సరాల క్రితం ఒక యువకుడు అందరిలానే తన గమ్యాన్ని వెతుక్కుంటున్నాడు.. సినిమా పరిశ్రమలో నిలబడ గలడా, లేడా అనే విషయం కూడా అప్పుడతనికి తెలీదు.. కానీ, పట్టుబట్టి మరీ తన మనసు ఏం చెప్పిందో అదే విన్నాడు.. 2002 మే 10న ఆ కుర్రాడు ‘అల్లరి నరేష్‌’గా మరోసారి పుట్టాడు. అల్లరి సినిమా ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసేలా చేసింది.

చూడడానికి అందంగా లేని నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు నేనెప్పుడూ వారికి రుణపడి ఉంటాను. ఇప్పుడెందుకీ విషయం చెబుతున్నాను, ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్ళు అయిన తర్వాత ఎందుకిలా మాట్లాడుతున్నాను అంటే, దానికి కారణం ‘రవి’..

అల్లరి సినిమాలో నా క్యారెక్టర్ పేరు ‘రవి’, మహర్షిలోనూ ‘రవి’నే.. ఈ 55 సినిమాల నా ప్రయాణం.. నా జీవితంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలను నింపింది. నన్నింతగా ఇంప్రూవ్ చేసిన చిత్ర పరిశ్రమకు, నాపై నమ్మకం ఉంచిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, ఇంకా ఫ్యాన్స్‌కి మీ నరేష్ హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు’.. అంటూ కాస్త హార్ట్ టచింగ్‌గా ఓ నోట్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసాడు. గతకొంత కాలంగా నరేష్ హీరోగా చేసిన సినిమాలు ఫెయిలవుతున్నాయి. అలాంటి టైమ్‌లో మహర్షి అతనికి బ్రేక్ ఇచ్చింది… ఇక నుండి నరేష్‌కి ఇలాంటి ఆఫర్స్ క్యూ కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.  
Also Read : OMG : ఆడుకునే బొమ్మ మింగి.. నటుడి కుమార్తె మృతి