Sabhaku Namaskaram : ‘అల్లరి’ నరేష్ 58.. ‘సభకు నమస్కారం’..

‘అల్లరి’ నరేష్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా అనౌన్స్ చేశారు..

Sabhaku Namaskaram : ‘అల్లరి’ నరేష్ 58.. ‘సభకు నమస్కారం’..

Allari Naresh New Movie Sabhaku Namaskaram

Sabhaku Namaskaram: మంచి కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ‘అల్లరి’ నరేష్ పుట్టినరోజు నేడు(జూన్ 30). ఈ సందర్భంగా నరేష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మహేష్ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సతీష్ మల్లంపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

నరేష్‌కి బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి ‘సభకు నమస్కారం’ అనే క్యాచీ టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెనక్కి తిరిగి రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాడు నరేష్. ప్యాంట్ పాకెట్స్‌లో మందు బాటిల్, కరెన్సీ కట్టలు చూపించారు.

ఈ లుక్ ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో పాటు సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసింది. ‘మహర్షి’ లో రవి క్యారెక్టర్, ‘నాంది’ లో సీరియస్ రోల్‌తో తనలోని నటుణ్ణి సరికొత్తగా చూపించిన నరేష్ ఈ సినిమాను తన స్టైల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చెయ్యనున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.