Naresh61: ఉగాది రోజున కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్న అల్లరి నరేశ్

టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండటంతో, మరోసారి నరేశ్-విజయ్ కాంబినేషన్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Naresh61: ఉగాది రోజున కొత్త సినిమాను స్టార్ట్ చేస్తున్న అల్లరి నరేశ్

Allari Naresh Next Movie Naresh61 To Launch On Ugadi

Naresh61: టాలీవుడ్ యంగ్ హీరో అల్లరి నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కిస్తుండటంతో, మరోసారి నరేశ్-విజయ్ కాంబినేషన్ హిట్ కొట్టడం ఖాయమని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

Vijay-Naresh : ఉగ్రం టీజర్ లాంచ్‌లో.. అదే డైరెక్టర్‌తో మూడో సినిమా కూడా ప్రకటించిన అల్లరి నరేష్

ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, అల్లరి నరేశ్ తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. నరేశ్ కెరీర్‌లో 61వ సినిమాగా రాబోతున్న ప్రాజెక్టును ఉగాది రోజున అఫీషియల్‌గా లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుండగా, ఈ సినిమాను రేపు ఉదయం 10.30 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టనున్నారు.

Actor Naresh : సినీ నటుడు నరేష్ ఇంటిపై దాడి.. కారు ధ్వంసం!

అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారా.. ఈ సినిమాలో మిగతా నటీనటులు, టెక్నికల్ సిబ్బంది ఎవరనే విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఉగాది రోజున ఇలా తన కొత్త సినిమాను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అల్లరి నరేశ్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరిచాడు.