Allari Naresh : నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్‌ వస్తున్నాయని అన్నారు

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''చాలా మంది నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్‌ వస్తున్నాయని అన్నారు. ‘గమ్యం’ సినిమా నేనే ఒప్పుకున్నాను. నాన్నగారు ఆ సినిమా............

Allari Naresh : నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్‌ వస్తున్నాయని అన్నారు

Allari Naresh

Allari Naresh :  అల్లరి లాంటి కామెడీ సినిమాలతో నవ్వించి, గమ్యం, శంభో శివ శంభో లాంటి కొన్ని సినిమాలలో ఎమోషన్ తో కూడా కట్టిపడేసిన అల్లరి నరేష్ ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్ళు అయినా సందర్భంగా తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ వాళ్ళ నాన్న గారి వల్లే సినిమాలకి వచ్చానని, ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నానని, నాన్న గారు లేకపోవడం వల్లే ప్లాప్స్ వచ్చాయని అంటున్నారని తెలిపాడు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ”చాలా మంది నాన్నగారు లేకపోవడం వల్లే నాకు ఫ్లాప్స్‌ వస్తున్నాయని అన్నారు. ‘గమ్యం’ సినిమా నేనే ఒప్పుకున్నాను. నాన్నగారు ఆ సినిమా చూశాక బాగా చేశావ్. మంచి పేరు వస్తుంది అని అన్నారు. కానీ ఆ తర్వాత నా కెరీర్‌లో ఫ్లాప్స్‌ రావడం వల్ల ఈవీవీగారు లేకపోవడం వల్లే నా సినిమాలు హిట్ కావట్లేదని చాలా మంది అన్నారు. నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా ‘సుడిగాడు’, ‘అహ నా పెళ్లంట..’ సినిమాలు హిట్‌ అయ్యాయి. నాన్నగారిని నేను చాలా మిస్ అవుతున్నాను. ‘నాంది’ సినిమా హిట్‌ అయినప్పుడు నాన్నగారు ఉంటే బాగుండు అనుకున్నాను.

Mahesh Babu-Major: నాలుగేళ్లుగా నేను ఏది పట్టుకున్నా బ్లాక్‌బ్లస్టరే!

‘మహర్షి’ చేసిన తర్వాత ఓ నిర్మాత నన్ను ఇక నువ్వు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానే వెళ్లిపోవచ్చు అని అన్నారు. కానీ ఆయనే నాంది హిట్ తర్వాత ఫోన్‌ చేసి విషెష్ చెప్పారు. ఎవరి కెరీర్‌ ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో ఎవరూ చెప్పలేరు, ఎవరు డిసైడ్ చేయలేరు” అని తెలిపారు.