కొత్త దర్శకుడితో అల్లరి నరేష్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ

అల్ల‌రి నరేష్ హీరోగా, విజ‌య్ క‌న‌క‌మేడ‌లను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సతీష్ వేగేశ్న ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ రూపొందించనున్నారు..

  • Published By: sekhar ,Published On : November 13, 2019 / 09:49 AM IST
కొత్త దర్శకుడితో అల్లరి నరేష్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ

అల్ల‌రి నరేష్ హీరోగా, విజ‌య్ క‌న‌క‌మేడ‌లను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సతీష్ వేగేశ్న ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ రూపొందించనున్నారు..

అల్ల‌రి నరేష్ హీరోగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ తెరకెక్కనుంది. న‌రేష్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే వైవిధ్య‌మైన పాత్ర‌ల్లోనూ న‌టిస్తూ అలరిస్తున్నాడు. ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ మహేష్ బాబు `మ‌హ‌ర్షి` చిత్రంలో న‌రేశ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్న సంగ‌తి తెలిసిందే. రవి క్యారెక్టర్‌లో నరేష్ నటన ఆకట్టుకుంది.

అలాగే మ‌రో వైపు త‌న‌దైన మార్క్ కామెడీ సినిమాలూ చేస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ నటిస్తున్న `బంగారు బుల్లోడు` షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇప్పుడు కొత్త దర్శకుడితో కొత్త సినిమా ప్రకటించాడు. న‌రేశ్ న‌టించ‌బోయే కాన్సెప్ట్ బేస్డ్ మూవీకి హ‌రీశ్ శంక‌ర్ ద‌గ్గ‌ర కో డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసి విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

Read Also : ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’ ఫస్ట్‌లుక్

`మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`, `ఒక్క క్ష‌ణం` చిత్రాల‌కు కో ప్రొడ్యూస‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన స‌తీశ్ వేగేశ్న నిర్మాత‌గా మారి ఎస్‌వీ2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్నినిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.