Allari Naresh: రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’!

కామెడీ హీరో నుండి ఇటీవల వరుసగా సీరియస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు హీరో అల్లరి నేరశ్. ఈ హీరో నటించిన రీసెంట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉండగా, ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక తనకు ‘నాంది’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన దర్శకుడు విజయ్ కనకమేడలతో మరోసారి చేతులు కలిపాడు అల్లరి నరేశ్.

Allari Naresh: రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఉగ్రం’!

Allari Naresh Ugram Movie Lock Release Date

Allari Naresh: కామెడీ హీరో నుండి ఇటీవల వరుసగా సీరియస్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు హీరో అల్లరి నేరశ్. ఈ హీరో నటించిన రీసెంట్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉండగా, ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఇక తనకు ‘నాంది’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని అందించిన దర్శకుడు విజయ్ కనకమేడలతో మరోసారి చేతులు కలిపాడు అల్లరి నరేశ్.

Allari Naresh Ugram: అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాకు హీరోయిన్ దొరికేసింది!

ఇప్పటికే వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ రెండో సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే న్యూస్‌ను ప్రకటించింది. ‘ఉగ్రం’ అనే పేరుతో రాబోతున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఈ మేరకు తాజాగా ఓ వీడియో టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్‌లో అల్లరి నరేశ్ ఓ బైక్‌పై వచ్చి, తనవద్ద ఉన్న గన్‌ను తీసి షూట్ చేస్తాడు. ఈ క్రమంలో అల్లరి నరేశ్ ఉగ్రరూపం మనకు చూపించబోతున్నట్లు ఆయన అరుస్తుంటాడు.

Allari Naresh : మళ్ళీ ఆ కాంబో.. నాంది 2 ??

ఇలా హీరో ఉగ్రరూపాన్ని ప్రేక్షకులకు చూపిస్తుండటంతో ఈ సినిమాకు ‘ఉగ్రం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మిర్నా నటిస్తోండగా, శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్దిలు కలిసి ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ప్రెస్టీజియస్‌గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి అల్లరి నరేశ్ ఈ ‘ఉగ్రం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో తెలియాలంటే ఏప్రిల్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.