Ugram : అల్లరి నరేష్ ఉగ్రం.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..

అల్లరి నరేష్ కి మంచి విజయం అందించిన ఉగ్రం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.

Ugram : అల్లరి నరేష్ ఉగ్రం.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..

Allari Naresh Ugram Movie streaming in Amazon Prime Video soon

Allari Naresh  : అల్లరి నరేష్(Allari Naresh), మిర్నా జంటగా నాంది(Nandi) దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఉగ్రం(Ugram) సినిమా మే 5న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. ఈ సినిమా థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. సినిమా చూసిన వాళ్లంతా అల్లరి నరేష్ ని ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ లో చూడలేదని, చాలా మాస్ అండ్ పవర్ ఫుల్ గా కనిపించారని అభినందించారు.

Samantha : ఖుషి షూటింగ్.. టర్కీలో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, సమంత

ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ ఉగ్ర రూపం చూపించాడని అంతా అన్నారు. ఈ సినిమాలో ఫైట్స్ అయితే అదిరిపోయాయి అని అన్నారు. అల్లరి నరేష్ కి మంచి విజయం అందించిన ఉగ్రం సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఉగ్రం సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో సినిమా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూడటానికి రెడీ అయిపోయారు. థియేటర్స్ లో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.