Unstoppable 2 : యువ హీరోలపై అగ్ర నిర్మాతల ఆసక్తికర కామెంట్స్.. షోలోనే ఓ హీరోకు ఛాన్స్ ఇచ్చిన అరవింద్..

ఇప్పటి హీరోల్లో యాక్టర్ అయి ఉండి డైరెక్టర్ గా ఎక్కువ ఎవరు మాట్లాడతారు అని అడిగాడు. సురేష్ బాబు.. బొమ్మరిల్లు సిద్దార్థ్, డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ పేర్లు రాసి వీళ్ళిద్దరూ హీరోల కంటే కూడా డైరెక్టర్స్ గానే...................

Unstoppable 2 : యువ హీరోలపై అగ్ర నిర్మాతల ఆసక్తికర కామెంట్స్.. షోలోనే ఓ హీరోకు ఛాన్స్ ఇచ్చిన అరవింద్..

Unstoppable 2 :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో సినిమాల గురించి అనేక విషయాలు మాట్లాడారు. అలాగే పలు ప్రశ్నలు అడిగారు బాలయ్య. ఇప్పటి హీరోల్లో యాక్టర్ అయి ఉండి డైరెక్టర్ గా ఎక్కువ ఎవరు మాట్లాడతారు అని అడిగాడు. సురేష్ బాబు.. బొమ్మరిల్లు సిద్దార్థ్, డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డ పేర్లు రాసి వీళ్ళిద్దరూ హీరోల కంటే కూడా డైరెక్టర్స్ గానే ఎక్కువ పనిచేస్తారు అని చెప్పారు. ఇక అరవింద్ మాట్లాడుతూ.. నవీన్ పోలిశెట్టి డైరెక్టర్ అవ్వాల్సిన వాడు హీరో అయ్యాడు. అతను హీరో కం డైరెక్టర్ గా సినిమా చేస్తాను అంటే నేను ఛాన్స్ ఇస్తాను అని షోలోనే నవీన్ పోలిశెట్టికి ఆఫర్ ఇచ్చారు.

Suresh Babu : రాజేష్ ఖన్నాతో గొడవ.. ప్రేమ్ నగర్ షూటింగ్ ఆపేశాం..

అలాగే ఇప్పుడున్న హీరోల్లో తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ డబ్బులు ఎవరు తెప్పించగలరు అని అడగగా అల్లు అరవింద్.. నాని పేరు, సురేష్ బాబు.. విజయ దేవరకొండ పేరు చెప్పారు. వీళ్లిద్దరి మీద తక్కువ బడ్జెట్ పెట్టి మంచి సినిమాలు తీస్తే చాలా బాగా కలెక్షన్స్ వస్తాయి అన్నారు.