Unstoppable : బిగ్గెస్ట్ టాక్ షో అఫ్ ఇండియా.. అన్‌స్టాపబుల్.. అల్లు అరవింద్ కామెంట్స్..

డిసెంబర్ 27న అన్‌స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ జరిగింది. దీంతో అన్‌స్టాపబుల్ షో షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో బయట బాలయ్య అభిమానులు, పవన్ అభిమానులు భారీగా.................

Unstoppable : బిగ్గెస్ట్ టాక్ షో అఫ్ ఇండియా.. అన్‌స్టాపబుల్.. అల్లు అరవింద్ కామెంట్స్..

Allu Aravind Comments on Unstoppable Show

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో వస్తున్న అన్‌స్టాపబుల్ షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరు ఎపిసోడ్స్ అవ్వగా ఏడో ఎపిసోడ్ గా ప్రభాస్, గోపీచంద్ న్యూ ఇయర్ కి రానున్నారు. ప్రభాస్ ఎపిసోడ్ తోనే షోకి మరింత బూస్ట్ వచ్చింది. తాజాగా అన్‌స్టాపబుల్ షోపై మరిన్ని అంచనాలు పెంచేయడానికి ఈ సారి ఏకంగా పవర్ స్టార్ ని తీసుకొచ్చారు.

నేడు డిసెంబర్ 27న అన్‌స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ షూట్ జరిగింది. దీంతో అన్‌స్టాపబుల్ షో షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియో బయట బాలయ్య అభిమానులు, పవన్ అభిమానులు భారీగా చేరుకొని జై బాలయ్య, జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. షూట్ అవ్వడంతోనే పవన్ – బాలయ్య ఎపిసోడ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎపిసోడ్ లో ఏం మాట్లాడతారు? సినిమాలతో పాటు రాజకీయాలు కూడా మాట్లాడతారా అని ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజకీయాల్లో కూడా చర్చ మొదలైంది. మొత్తానికి పవన్ – బాలయ్య ఎపిసోడ్ తో అన్‌స్టాపబుల్ షోని, ఆహాని మరో రేంజ్ కి తీసుకెళ్లేలా చేస్తున్నారు ఆహా టీం.

Nagababu : చిరంజీవి మీద కానీ, ఆయన ఫ్యామిలీ మీద కానీ ఈగ వాలినా ఊరుకోము..

ఇక ఈ ఎపిసోడ్ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ”బిగ్గెస్ట్ టాక్ షో అఫ్ ఇండియా అన్‌స్టాపబుల్. ఈ షో స్టార్ట్ అయ్యాక ఒక మంచి షో అవుతుంది అనుకున్నాను. కానీ ఈ రేంజ్ లో ఇంత పెద్దగా సక్సెస్ అవుతుంది అనుకోలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు. పవన్ వచ్చి ఈ షోని మరో రేంజ్ కి తీసుకెళ్లనున్నారు. ఇది అన్‌స్టాపబుల్ లోనే బెస్ట్ ఎపిసోడ్ అవుతుంది. ఇండియాలోనే బెస్ట్ షోగా అన్‌స్టాపబుల్ నిలిచింది. ఇటివంటి షో ఇంకోటి రాదు” అని అన్నారు.