మొదటి సినిమా విడుదలకు ముందే.. ‘పలాస’ దర్శకుడికి అరవింద్ అదిరిపోయే ఆఫర్

‘పలాస 1978’ దర్శకుడికి గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేసే అవకాశమిచ్చిన అల్లు అరవింద్..

  • Published By: sekhar ,Published On : March 5, 2020 / 12:10 PM IST
మొదటి సినిమా విడుదలకు ముందే.. ‘పలాస’ దర్శకుడికి అరవింద్ అదిరిపోయే ఆఫర్

‘పలాస 1978’ దర్శకుడికి గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేసే అవకాశమిచ్చిన అల్లు అరవింద్..

‘పలాస 1978’.. గతకొద్ది రోజులుగా ఫిల్మ్, మీడియా సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్న పేరు ఇది. సినీ, మీడియా ప్రముఖులకు ప్రత్యేక షోలు ప్రదర్శిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు మూవీ టీమ్. రక్షిత్, నక్షత్ర జంటగా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా.. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాతో కరుణ కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజాగా ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, బన్నీ వాసు ‘పలాస’ ప్రివ్యూ చూశారు. వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకుని మంచి కథ, కథనాలతో దర్శకుడు కరుణ కుమార్ సినిమా బాగా తీశాడని అభినందిస్తూ అతనితో తమ బ్యానర్‌లో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించి మీడియా సమక్షంలో అడ్వాన్స్ చెక్కు అందించారు అల్లు అరవింద్.

ఫస్ట్ సినిమా విడుదలకు ముందే గీతా ఆర్ట్స్ వంటి అగ్రనిర్మాణ సంస్థలో ఆఫర్ దక్కించుకోవడంతో డైరెక్టర్ కరుణ కుమార్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న ‘పలాస 1978’ గ్రాండ్‌గా విడుదల కానుంది.  

Allu Aravind Handed Advance Cheque To ‘Palasa 1978’ Director