Nepotism : నన్ను ట్రోల్ చేసినా సరే.. నెపోటిజంలో తప్పులేదు.. అల్లుఅరవింద్ వ్యాఖ్యలు..

అల్లు అరవింద్ దీనికి సమాధానమిస్తూ.. నేను పూర్తిగా నెపోటిజంలో మునిగి ఉన్నాను. దీనిపై నన్ను చాలా మంది ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్స్ చేసే వాళ్ళని నేను అడుగుతున్నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మీ కుటుంబంలో.............

Nepotism : నన్ను ట్రోల్ చేసినా సరే.. నెపోటిజంలో తప్పులేదు.. అల్లుఅరవింద్ వ్యాఖ్యలు..

allu aravind serious comments on Nepotism

Nepotism :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో సినిమాలతో పాటు కొన్ని కాంట్రవర్సీ విషయాల గురించి కూడా మాట్లాడారు. ఇటీవల చాలా మంది సినిమా వాళ్ళని నెపోటిజం కిడ్స్ అని ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై బాలకృష్ణ తన షోలో అడిగాడు. బాలయ్య.. నేను కూడా నెపో కిడ్ నే. నెపోటిజంపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగారు.

అల్లు అరవింద్ దీనికి సమాధానమిస్తూ.. నేను పూర్తిగా నెపోటిజంలో మునిగి ఉన్నాను. దీనిపై నన్ను చాలా మంది ట్రోల్ చేస్తారు. ఆ ట్రోల్స్ చేసే వాళ్ళని నేను అడుగుతున్నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి మీ కుటుంబంలో ఒకే పని చేసే వాళ్ళు లేరా, మీ ఫ్యామిలీ వారసత్వాన్ని మీరు కొనసాగించరా? అసలు మా ఫ్యామిలీతో నాకు సంబంధం లేదు, నేను వేరే పని చూసుకుంటాను అన్నవాళ్ళు నన్ను ట్రోల్ చేయండి. నా ఫ్రెండ్ ఒకతను లాయర్, అతని పేరెంట్స్ కూడా లాయర్, మరి అది నెపోటిజం అవ్వదా? మనం పెరిగే పరిసరాలని బట్టి మనం ఏమి అవ్వాలని నిర్ణయించుకుంటాం. సినిమాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లోకి రావాలనుకుంటారు. అయినా రాజకీయాలు, డాక్టర్స్.. ఇలా అన్ని వృత్తుల్లో నెపోటిజం ఉంది. కానీ కేవలం సినిమా వాళ్లనే అంటారు అని తెలిపారు.

Unstoppable 2 : మాస్ సినిమా, ఓటీటీ, ఐటం సాంగ్స్ పై అల్లు అరవింద్, సురేష్ బాబు కామెంట్స్..

ఇక సురేష్ బాబు మాట్లాడుతూ.. నెపోటిజం అనేది ఓన్లీ ఫస్ట్ స్టెప్. అలర్ట్, ట్యాలెంట్ లేకపోతే సక్సెస్ రాదు. నెపోటిజంలో ఉన్న అందరికి సక్సెస్ రాదు. అలాంటి వాళ్ళని కూడా చూశాము అని అన్నారు.