భవిష్యత్ డిజిటల్ రంగానిదే – భయంతోనే ‘ఆహా ఓటీటీ’ ప్రారంభం : అల్లు అరవింద్

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు.. ఘనంగా ‘ఆహా ఓటీటీ’ ప్రివ్యూ ఫంక్షన్..

  • Published By: sekhar ,Published On : February 10, 2020 / 04:56 AM IST
భవిష్యత్ డిజిటల్ రంగానిదే – భయంతోనే ‘ఆహా ఓటీటీ’ ప్రారంభం : అల్లు అరవింద్

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు.. ఘనంగా ‘ఆహా ఓటీటీ’ ప్రివ్యూ ఫంక్షన్..

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ డిజిటల్ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయ్యారు. ట్రెండ్‌కి తగ్గట్టు, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సినిమాలు నిర్మించడంలో ఆయనది అందె వేసిన చేయి.. ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ఆయనకెవరూ సాటి రారు.. గీతా ఆర్ట్స్ సంస్థలో భారీ కమర్షియల్ సినిమాలు నిర్మించిన అరవింద్ ప్రస్తుత ట్రెండ్, జనరేషన్‌కి తగ్గట్టు జీఏ 2 పిక్చర్స్ అనే మరో బ్యానర్ స్థాపించి కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తూ మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్నారు.

మారుతున్న కాలానుగుణంగా అరవింద్ ఇప్పుడు మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావ్, రామ్‌లతో పాటు మరికొందరి భాగస్వామ్యంతో ‘ఆహా ఓటీటీ’ కి శ్రీకారం చుట్టారు. తాజాగా హైదరాబాద్‌లో ‘ఆహా ఓటీటీ’ ప్రివ్యూ ఫంక్షన్ నిర్వహించారు. 

‘‘ఎవరైనా డిజిటల్‌ మీడియంలోకి రావాలంటే సందేహించొద్దు. భవిష్యత్తు డిజిటల్‌ రంగానిదే. ఏడాది క్రితం ఓ మీడియం మన సినిమాలను తినేస్తుందేమో అనే భయంతో ‘ఆహా ఓటీటీ’ ప్రయాణం మొదలైందని చెప్పవచ్చు. ఆహా గురించి మా అబ్బాయిలకు (అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శీరిష్‌) లకు చెప్పగానే..‘నాన్నా.. నువ్వు రేపటిని చూస్తున్నావ్‌’.. అన్నారు.
ఇది మాకు కొత్త. అందుకే అందరి సహకారాన్ని కోరుకుంటున్నాం. మై హోమ్‌ రామేశ్వర్‌రావుగారు, అజయ్‌ ఠాకూర్‌ హ్యాండిల్‌ చేస్తున్నారు.

టెక్నాలజీ బిజినెస్‌ గురించి కోల్‌కతాలోని మా స్నేహితులు, ఓ అమెరికన్‌ కంపెనీ సపోర్ట్‌ తీసుకుంటున్నాం. ఈ ఏడాది పాతిక షోలను ప్లాన్‌ చేస్తున్నాం. దర్శకుడు క్రిష్‌ ఓ షో చేస్తున్నారు. ఇందులో కంటెంట్‌ బోల్డ్‌గా ఉంటుంది. కాబట్టి పేరెంట్‌ కంట్రోలింగ్‌ సిస్టమ్‌ ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు.. తెలుగు సినిమా నిర్మాణంలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన అల్లు అరవింద్ ‘ఆహా ఓటీటీ’ ద్వారా డిజిటల్ రంగంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేయనున్నారు.