Chiru-Balayya Combo : చిరు-బాలయ్య కాంబినేషన్.. డైరెక్టర్ ఈయనే.. కథ కూడా చెప్పేసిన బాలయ్య బాబు..

బాలకృష్ణ, అల్లు అరవింద్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దీని గురించి బాలయ్య బాబు అడిగితే అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మీరు, చిరంజీవి కాంబినేషన్ అయితే నేను నిర్మాతగా చేస్తాను............

Chiru-Balayya Combo : చిరు-బాలయ్య కాంబినేషన్.. డైరెక్టర్ ఈయనే.. కథ కూడా చెప్పేసిన బాలయ్య బాబు..

allu aravind wants to do a film with chiranjeevi and balakrishna

Chiru-Balayya Combo :  ఆహా ఓటీటీలో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే నాలుగు ఎపిసోడ్లు కాగా తాజాగా ఐదో ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఐదో ఎపిసోడ్ కి అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామిరెడ్డి వచ్చారు. ఇటీవలే ఈ ప్రోమో రిలీజ్ చేయగా వైరల్ అవ్వడంతో ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ముఖ్యంగా ముందు జనరేషన్ వాళ్ళు ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూశారు. శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ని ఆహాలో రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ లో సినిమాలకి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలని మాట్లాడారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఉన్న మల్టీస్టారర్స్ ఇటీవల మళ్ళీ వస్తున్న సంగతి తెలిసిందే. స్టార్స్ అంతా మల్టీస్టారర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, అల్లు అరవింద్ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. దీని గురించి బాలయ్య బాబు అడిగితే అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మీరు, చిరంజీవి కాంబినేషన్ అయితే నేను నిర్మాతగా చేస్తాను అన్నారు. నాకు అదొక్కటే ఆశ ఉంది అని అన్నారు.

ఆ తర్వాత డైరెక్టర్ రాఘవేంద్ర రావు వచ్చాక చిరు, బాలయ్య కాంబినేషన్ లో సినిమా తీస్తే నేనే డైరెక్ట్ చేస్తా అన్నారు. దీనిపై బాలయ్య మాట్లాడుతూ.. అప్పుడు చిరంజీవికి పాటలు పెట్టాలి, నాకు ఫైట్స్ పెట్టాలి. చిరంజీవికి ఇంట్రడక్షన్ సాంగ్ ఇవ్వాలి. నాకు క్లైమాక్స్ ఫైట్ ఇవ్వాలి అని కథ ఎలా ఉండాలో చెప్పేశారు. ఎవరు దేంట్లో బెస్టో వాళ్ళకి అది ఇవ్వమని బాలయ్య అనడంతో సరే ప్లాన్ చేస్తా అన్నారు. అప్పుడు బాలకృష్ణ అది పాన్ వరల్డ్ సినిమా అవుతుంది అన్నారు.

Balakrishna : మీ బావకి పోటీ వస్తారని యాక్టింగ్ నుంచి తప్పుకోమన్నాడా??

ఈ కాంబినేషన్ కనుక నిజంగా వర్కౌట్ అయితే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. ముఖ్యంగా 80s, 90s జనరేషన్స్ ఫుల్ ఫిదా అవుతారు. ఈ కాంబినేషన్లో సినిమా రావాలని అందరూ కోరుకుంటున్నారు. చూడాలి మరి ఇది నిజంగానే జరుగుతుందా లేదా.