Allu Arha : డబ్బింగ్ చెప్తున్న అర్హ.. మురిసిపోయిన అల్లు అర్జున్..

తాజాగా అర్హ కూడా ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పింది. అర్హ ఈ సినిమాలో శకుంతల తనయుడు భరత రాజు క్యారెక్టర్ వేసినట్టు సమాచారం. దానికి సంబంధించిన డబ్బింగ్.................

Allu Arha : డబ్బింగ్ చెప్తున్న అర్హ.. మురిసిపోయిన అల్లు అర్జున్..

Allu Arha started Dubbing for Shakunthalam Movie

Allu Arha :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ చాలా పాపులర్ అని అందరికి తెలిసిందే. అల్లు స్నేహ.. అర్హ అల్లరి పనులన్నీ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా బాగా పాపులర్ అయిపొయింది. అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వనుంది. సమంత మెయిన్ లీడ్ లో గుణశేఖర్ దర్శకత్వంలో నీలిమ గుణ, దిల్ రాజు నిర్మాణంలో పురాణాల్లోని దుశ్యంతుడు-శకుంతల కథని గ్రాండ్ గా ‘శాకుంతలం’ సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్తుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టింది. మరో పక్క ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం విజువల్ వండర్ లా అనిపించి సినిమాపై అంచనాలు పెంచేసింది. శాకుంతలం సినిమాని ఫిబ్రవరి 17న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల సమంత ఈ సినిమాకి డబ్బింగ్ చెప్తున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Avatar 3 : అవార్డుల వేదికపై అవతార్-3 కథ చెప్పిన జేమ్స్ కామెరూన్.. భూమి, నీరు, నెక్స్ట్?

తాజాగా అర్హ కూడా ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పింది. అర్హ ఈ సినిమాలో శకుంతల తనయుడు భరత రాజు క్యారెక్టర్ వేసినట్టు సమాచారం. దానికి సంబంధించిన డబ్బింగ్ అర్హ ఇటీవల చెప్పగా స్నేహారెడ్డి దాన్ని ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోని అల్లు అర్జున తన స్టోరీలో కూడా షేర్ చేసి తన కూతురు డబ్బింగ్ చెప్తుందని మురిసిపోయారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ట్రైలర్ లో అర్హ సింహంపై కూర్చొని రావడంతో బన్నీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.