‘రాములో రాములా’ పాట సీక్రెట్ చెప్పిన అల్లు అర్హ.. వీడియో వైరల్

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 10:03 AM IST
‘రాములో రాములా’ పాట సీక్రెట్ చెప్పిన అల్లు అర్హ.. వీడియో వైరల్

బన్నీ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ నుంచి సామజవరగమన, రాములో రాములా, ఓ మై గాడ్ డాడీ, బుట్ట బొమ్మ అలా ఒక్కో పాట రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాములో రాములా పాటకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ వచ్చిందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి పాటలోని స్టెప్పుల గురించి బన్నీ కూతురు అల్లు అర్హ చేసిన కామెంట్లను వినండి. 

అల్లు అర్జున్ అలా వైకుంటపురంలో సినిమా గురించి అల్లు అర్హను కొన్ని ప్రశ్నలు వేస్తూ.. వీడియో తీశాడు. ఆ ప్రశ్నలేంటంటే నాన్న సినిమా పేరేంటి? అని అడిగితే.. అల వైకుంఠపురములో అని చెప్పింది. అనంతరం.. అందులో ఎల్లో కలర్ జాకెట్ వేసుకుని డ్యాన్సు చేస్తాను కదా అది ఏ పాటా..? అని అడిగితే.. రాములో రాముల అని ముద్దుగా చెప్పింది. అందులో నేను ఎల్లో జాకెట్ తో ఏం స్టెప్ వేస్తా అని ప్రశ్నించగా.. దోశ స్టెప్ అని వేసి చూపించింది. 

దీంతో అల్లూ అర్జు నవ్వుతూ.. ఓ సారి దోశ స్టెప్ వెయ్యి అని అడగాడు. వెంటనే ఆ స్టేప్ వేసి చూపించింది. అల్లు అర్హ వేసిన క్యూట్ స్టెప్పులకు బన్నీ పగల బడి నవ్వేశాడు. ఈ క్యూట్ వీడియో ను స్నేహా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Dosa step ?#alavaikunthapurramuloo @alluarjunonline

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on