Allu Arjun: స్నేహతో 11 ఏళ్ల బంధం.. బన్నీ మ్యారేజ్ సెలబ్రేషన్స్

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా అల్ ఓవర్ ఇండియాను దున్నేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మాంచి ఊపుముందున్నాడు. ఇదే ఊపులో పుష్ప2 కూడా లైన్లో పెట్టేసి సూపర్ డూపర్..

Allu Arjun: స్నేహతో 11 ఏళ్ల బంధం.. బన్నీ మ్యారేజ్ సెలబ్రేషన్స్

Allu Arjun

Allu Arjun: పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా అల్ ఓవర్ ఇండియాను దున్నేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మాంచి ఊపుముందున్నాడు. ఇదే ఊపులో పుష్ప2 కూడా లైన్లో పెట్టేసి సూపర్ డూపర్ హైలెవెల్ లో రికార్డులు కొల్లగొట్టాలని సిద్దమవుతున్నాడు. ఇక, బన్నీ కెరీర్ లోనే కాదు ఫ్యామిలీ లైఫ్ ను బ్యాలెన్స్ చేయడంలో కూడా మంచి మార్కులే కొట్టేశాడు. స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ ఇప్పటికీ అంతే ప్రేమగా ఫ్యామిలీ కోసం టైం కేటాయిస్తున్నాడు.

Allu Arjun: కాంట్రావర్సిగా అల్లు అర్జున్ జొమాటో యాడ్

షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికితే ఫ్యామిలీతో వెకేషన్ చెక్కేసే బన్నీ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ తీసుకొని మరీ విదేశాలకు విహార యాత్రలను వెళ్లి వస్తుంటాడు. ఇంట్లో కూడా కూతురు అర్హతో కలిసి బన్నీ టైం స్పెండ్ చేస్తుంటే స్నేహ ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అలాగే బన్నీ తాజాగా మరో బ్యూటిఫుల్, క్యూట్ ఫోటోని షేర్ పోస్ట్ చేశాడు.

Allu Arjun: ప్రమోషన్స్ వివాదం.. బన్నీకి బ్రాండే బ్యాడా?

ఈ పిక్ లో తాను తన భార్య స్నేహ, పిల్లలు అల్లు అయాన్, అర్హలతో కలిసి క్యూట్ సెలెబ్రేషన్స్ లో కనిపించారు. తన భార్య స్నేహతో వివాహ బంధం నేటితో 11 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో దానిని కేక్ కట్ చేసి ఎంతో ఆనందంగా సెలెబ్రేట్ చేసుకున్నట్టు బన్నీ తెలిపాడు. ఈ బ్యూటిఫుల్ స్నాప్ చూసి ఆనందం వ్యక్తం చేస్తున్న అభిమానులు ఐకాన్ స్టార్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)