Allu Arjun – Trivikram : క్రేజీ కాంబో మళ్లీ కుదిరింది..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్.. ఇద్దరు ఏ షూటింగ్‌లో ఉన్నారో తెలుసా..?

Allu Arjun – Trivikram : క్రేజీ కాంబో మళ్లీ కుదిరింది..

Bunny

Allu Arjun – Trivikram: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్.. వీళ్లిద్దరి సక్సెస్‌ఫుల్ అండ్ హ్యాట్రిక్ కాంబినేషన్.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో తెరమీదకు రాబోతుంది.

Maha Prasthanam : శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరిణికపై పవన్ – త్రివిక్రమ్ ముచ్చట..

అంటే బన్నీ – త్రివిక్రమ్ కలయికలో సినిమా రాబోతుంది అనుకునేరు. వీళ్లు కలిసి పని చేస్తుంది ఓ యాడ్ కోసం. ఇంతకుముందు తెలుగు ఓటీటీ ‘ఆహా’ కోసం ఓ యాడ్ కూడా చేశారు. ఇప్పుడు మరోసారి ఓ యాడ్ కోసం చేతులు కలిపారు. షూటింగ్ లొకేషన్లో బన్నీ, త్రివిక్రమ్ కలిసి ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

Allu Arjun: అల్లు అర్జున్ సింప్లిసిటీ.. రోడ్ పక్కన టిఫిన్ చేసిన ‘ఐకాన్ స్టార్’

అల్లు అర్జున్ ప్రస్తుతం బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ చేస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. తర్వాత వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసే ‘ఐకాన్’ షూటింగ్‌లో పాల్గొంటారు. త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చెయ్యబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

Allu Arjun : బన్నీ లెక్క మారింది.. బోయపాటికి నో చెప్పింది అందుకేనంట..