‘పలాస’ టీమ్‌కు అభినందనలు .. స్నేహితుడు కేదార్ శెలగంశెట్టి నిర్మాతగా సక్సెస్ కావాలి..

  • Published By: sekhar ,Published On : October 2, 2020 / 03:12 PM IST
‘పలాస’ టీమ్‌కు అభినందనలు .. స్నేహితుడు కేదార్ శెలగంశెట్టి నిర్మాతగా సక్సెస్ కావాలి..

Allu Arjun: క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న సినిమాతో నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్న కేదార్ శెలగంశెట్టి అభిరుచిగల చిత్రాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాతగా ఎదగాలని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ఇటీవల Falcon Creations LLP బ్యానర్ ద్వారా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ తన స్నేహితుడు కేదార్‌ను అభినందించారు.


ఈ ఏడాది మార్చిలో విడుద‌లైన చిత్రం ‘పలాస 1978’. ఈ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు కరుణ కుమార్. వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాను తెరకెక్కించిన కరుణ కుమార్ ను సినీ ప్రముఖులందరూ అభినందిస్తున్నారు.


తాజాగా మంచి సినిమా చేశారంటూ కరుణ కుమార్‌ను అభినందిస్తూ ‘పలాస 1978’ చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేశారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్‌కు ఓ మొక్కను బహూకరించారు అల్లు అర్జున్. మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కరుణ కమార్. తన జీవితంలో ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు. కాగా గీతా ఆర్ట్స్ లో కరుణ కుమార్ ఓ సినిమా చేయబోతున్నారు.


Karuna Kumar